తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నడైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈయన దర్శకత్వంలో వచ్చిన గులాబీ నిన్నే పెళ్ళాడుతా ఖడ్గం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
ఇకపోతే ఈయన 2017లో దర్శకత్వం వహించిన నక్షత్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనంతరం ఇకపై ఎలాంటి సినిమాలు చేయలేదు.

ఇకపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇకపోతే ఈయన ఎప్పటికైనా వందేమాతరం అనే సినిమా చేయాలనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు.
తాజాగా పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన ఎట్టకేలకు పట్టాలెక్కిందని అలాగే తాను కూడా వందేమాతరం సినిమాని ఎప్పటికైనా చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా యాంకర్ కృష్ణవంశీను ప్రశ్నిస్తూ పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ అనే పేరుతో చిన్న చిన్న ఆడియో క్లిప్స్ విడుదల చేస్తూ ఉంటారు.వాటిని విన్నారా అని ప్రశ్నించగా వినలేదని ఆయన పూరీ జగన్నాథ్ లాగా అలాంటి విషయాలు తాను చెప్పలేనని ఈ సందర్భంగా కృష్ణవంశీ వెల్లడించారు.ఇలాంటి విషయాలను జనాలకు చెప్పే అంతా జ్ఞానం నాకు లేదని నేను అనుకుంటాను నేను ఏదైనా చెప్పాలనుకుంటే సినిమాల ద్వారా మాత్రమే చెబుతానని ఈ సందర్భంగా కృష్ణవంశీ పూరి జగన్నాథ్ తో పోలుస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







