గ్రామాల్లో కోడిపుంజులు ఉదయాన్నే లేచి చాలా పెద్దగా కూత పెడుతుంటాయి.ఈ కూత వింటే ఎవరైనా సరే నిద్ర లేవాల్సిందే.
ఈ కూత ఒక అలారం లాగా పనిచేస్తుంది.దీనివల్ల పెద్దగా ఎవరికీ కూడా ఇబ్బంది ఉండదు.
కానీ ఒక జంటకి మాత్రం కోడిపుంజు వల్ల బతుకు నరకం అయిపోయింది.ఆ పుంజు వల్ల వీరు ఒక్క రోజు కూడా ప్రశాంతంగా నిద్రపో లేక పోతున్నారట.
అందుకే ఈ వృద్ధ దంపతులు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు.వీరికంటే ముందు ఈ కోడిపుంజు దెబ్బకు కొందరు ఆ సమీప దరిదాపుల్లో కూడా లేకుండా ఇల్లు మారిపోయారు.
ఎందుకంటే ఆ కోడి ఉదయం ఎనిమిది గంటలకు అరవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం ఆరింటికి వరకు అసలు ఆగదు.అది అరిసే శబ్దం కనీసం అర కిలోమీటరు వరకు వినిపిస్తుందట.
ఇక సమీపంలో ఉన్న వారి చెవులు చిల్లులు పడుతున్నాయట.అందుకే కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే వృద్ధ దంపతులు మాత్రం కోడిపై కేసు పెట్టారు.
జర్మనీలో ఈ ఘటన వెలుగు చూసింది.ఫ్రెడ్రిక్, జుటా అనే వృద్ధ జంట కోడిపుంజుపై కోర్టులో ఫిర్యాదు చేశారు.ఇలాంటి కోడిని పెంచుతున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని, దాని శబ్దం ఇతరులను బాధించే లాగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని వారు విన్నవించుకున్నారు.అంతేకాదు పక్కా ఆధారాలు కూడా కోర్టులో సమర్పించారు.
కోడి పెట్టే కూతను వీడియో రికార్డు చేసి మరీ కోర్టు ముందుంచారు.అలానే, ఈ కోడికూత భరించలేక ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి వివరాలు కూడా కలెక్ట్ చేసి న్యాయమూర్తి ముందు ఉంచారు.
కాగా ఈ వింత కేసును లెమ్గో జిల్లా జడ్జి డీల్ చేయనున్నారు.ఇప్పటికే ఈ కేసులో స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది.మరి ఇలాంటి కేసులో ఎలాంటి తీర్పు ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







