టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి కంటిన్యూ అవుతోంది.మూడు వారాల క్రితం వచ్చిన బింబిసార మరియు సీతారామం సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
మీడియం రేంజ్ సినిమాలు అయిన ఆ రెండు సినిమాలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సాధించిన వసూళ్లను ట్రేడ్ వర్గాల వారు అభినందించారు.రెండు సినిమాలు కూడా 50 కోట్ల కు మించిన గ్రాస్ వసూళ్లను సాధించడంతో అందరి ప్రశంసలు దక్కించుకున్నాయి.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ రెండు సినిమాల వసూళ్లను మరే మీడియం రేంజ్ సినిమాలు కాని.చిన్న సినిమాలు కానీ దక్కించుకునే అవకాశం లేదని అంతా భావించారు.
కానీ అనూహ్యంగా కార్తికేయ 2 సినిమా తో నిఖిల్ ఆ ఘనత దక్కించుకున్నాడు.కార్తికేయ 2 సినిమా కేవలం పది రోజుల్లో ఏకంగా రూ.75.33 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.అతి త్వరలోనే వంద కోట్ల వసూళ్ల దిశగా ఈ సినిమా దూసుకు వెళ్తోంది.
బాలీవుడ్ లో ఈ సినిమా మంచి షేర్ ను రాబడుతోంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం లైగర్ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.లైగర్ సినిమా యొక్క వసూళ్ల ను ఆధారంగానే కార్తికేయ 2 సినిమా యొక్క వసూళ్ల కంటిన్యూ ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
లైగర్ సినిమా ఫలితం కాస్త అటు ఇటు అయితే కచ్చితంగా కార్తికేయ 2 సినిమా వంద కోట్ల గ్రాస్ ను చేయడం పెద్ద కష్టం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్ల జోరు కంటిన్యూ అవుతోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్లు ఆ చిత్ర యూనిట్ సభ్యులకు ఫుల్ హ్యాపీ గా ఉన్నాయి.పెట్టుబడికి ఏకంగా మూడు నాలుగు రెట్ల లాభాలను ఈ సినిమా తెచ్చి పెడుతుంది అంటూ టాక్ వినిపిస్తుంది.
బింబిసార మరియు సీతారామం సినిమాలను మించి కార్తికేయ 2 సినిమా భారీ వసూళ్లను సాధించి ఆ రెండు సినిమాల కంటే పై చేయి సాధించింది.







