ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులతో పాటు పలు అంశాలపై చర్చించారు.ఇందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని సీఎం జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని కోరినట్లు సమాచారం.
అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో జగన్ సమావేశం కానున్నారు.
సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు.ఆ తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ను కూడా కలుసుకోనున్నారు సీఎం జగన్.







