ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళైనా అంజలి సంపాదించిన ఆస్తులు ఇంతేనా.. అయ్యో!

టాలీవుడ్ నటి తెలుగు ముద్దుగుమ్మ అంజలి పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Tollywood Actress Anjali Properties And Remuneration Details Details, Anjali,tol-TeluguStop.com

తన పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది.తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించింది.

కానీ తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం అంతా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అంజలి.2006లో ఫోటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అంజలి ఆ తర్వాత ఏడాది తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఇక అక్కడే వరుస సినిమాలలో సెటిలైన మళ్లీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రి ఇచ్చింది.

ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.

తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు రాగా మళ్ళీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక వకీల్ సాబ్ సినిమాలో నటించగా తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

కానీ అంజలికి ఆఫర్లు మాత్రం అంతగా రాలేకపోయాయి.ఇక ఎన్నోసార్లు అంజలి టాలీవుడ్ కు రీ ఎంట్రీ కూడా ఇవ్వగా సక్సెస్ లు రాకపోవడానికి కారణం మాత్రం మరొకటి ఉందట.

Telugu Actress Anjali, Anjali, Anjali Offers, Chennai, Hyderabad, Tollywood-Movi

తను అతి తక్కువ సమయంలోనే సీనియర్ హీరోల సరసన నటించడంతో డిమాండ్ తగ్గిందని, అంతేకాకుండా తర్వాత చేయవలసిన హారర్ సినిమాలు కూడా ముందుగానే చేసేసిందని, ఇక అదే సమయంలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించడంతో.అలా ఒకే సమయంలో ఓకే దానిపై ఆధారపడి ఉండక తొందర పడటం వల్ల తనకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయని గతంలో తెలిసింది.

దీంతో తనకు అవకాశాలు రాకపోవడంతో తను గ్లామర్ షో కూడా చేయటానికి సిద్ధమయింది.ఏకంగా పొట్టి పొట్టి బట్టలు ధరించి బాగా డోస్ పెంచి తన అందాలను బయటకు వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయినా కూడా అవకాశాలు అందుకోవట్లేదు అని తెలుస్తుంది.పైగా ఈ మధ్య కొత్త కొత్త హీరోయిన్లు రావడం వల్ల కూడా తనకు అవకాశాలు రావట్లేదు అని అర్థమవుతుంది.

Telugu Actress Anjali, Anjali, Anjali Offers, Chennai, Hyderabad, Tollywood-Movi

ఇక తాజాగా ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు అంజలి నటించిన సినిమాలు అన్ని కొంతవరకు సక్సెస్ అందుకోగా వచ్చిన పారితోషకాలతో తను సంపాదించిన ఆస్తులు ఎంతో చాలా వరకు ఎవరికీ తెలియదు.తాజాగా తన ఆస్తుల గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి.

ఇక అంజలి చెన్నైతో పాటు హైదరాబాద్ లోనూ సంపాదించిన ఆస్తుల విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో ఆమె తన ఆస్తుల విషయంలో తన కుటుంబ సభ్యులతో గొడవ పడిందని తెలిసింది.ఇక అంజలి ఒక్కో సినిమాకు దాదాపు రూ.80 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఆమె ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్న కూడా ఏ మాత్రం సంపాదించకపోవడంతో అందరూ తనను అయ్యో అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube