ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సిసోడియాతో పాటు మరో 13 మందికి నోటీసులు అందించింది.
లుక్ అవుట్ నోటీస్ సదరు వ్యక్తిని దేశం విడిచి వెళ్లకుండా నిరోధిస్తుంది.ఒకవైళ వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవచ్చు.
సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు.ఇదేం డ్రామా అంటూ ప్రధాని మోదీపై మండిపడ్డారు.
మీ దాడులన్నీ అయిపోయాయి.ఏమీ దొరకలేదు.
ఒక్క పైసా కూడా లభించలేదు.ఇప్పుడు మనీశ్ సిసోడియా అందుబాటులో లేరని లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.
ఏంటీ మోదీజీ ఈ జిమ్మిక్కు.? నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను, ఎక్కడికి రావాలో చెప్పండి, మీరెక్కడున్నారో నాకు కనిపించడం లేదంటూ ట్వీట్ చేశారు.







