కొన్నేళ్ల క్రితం వరకు ఒకటి లేదా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్లకు కొత్త ఆఫర్లు రావడం కష్టమని ఇండస్ట్రీలో అభిప్రాయం ఉండేది.కానీ ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు జయాపజయాలకు అతీతంగా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్ల కొరత వేధిస్తుండటంతో చాలామంది హీరోయిన్లకు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఉప్పెన సినిమాతో కృతిశెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు యావరేజ్ రిజల్ట్ ను అందుకోగా ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో కృతిశెట్టికి భారీ షాకులు తగిలాయి.అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కొందరు దర్శకులు కృతిశెట్టికి ఛాన్స్ ఇస్తున్నారు.
ఇతర భాషల నుంచి కూడా కృతిశెట్టికి సినిమా ఆఫర్లు వస్తుండటం గమనార్హం.
స్టార్ హీరోయిన్ సాయిపల్లవి గతేడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో సక్సెస్ లను అందుకునారు.

అయితే ఈ ఏడాది విరాటపర్వం, గార్గి సినిమాలతో సాయిపల్లవికి భారీ షాక్ తగిలింది.ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా దర్శకనిర్మాతలు సాయిపల్లవికి ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు.మరో స్టార్ హీరోయిన్ రాశీఖన్నాకు గత నెలలో పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలతో రెండు ఫ్లాపులు ఆమె ఖాతాలో చేరాయి.

సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సాయిపల్లవి కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం.గత కొంతకాలంగా కెరీర్ పరంగా చెప్పుకోదగ్గ సినిమా లేని సమంత ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.అనుష్క, తమన్నా, పూజా హెగ్డే కూడా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ల కంటే సౌత్ హీరోయిన్లకే దర్శకనిర్మాతలు ఎక్కువగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం.సక్సెస్ ట్రాక్ లో ఉన్న మరి కొందరు హీరోయిన్లు సైతం భారీస్థాయిలో ఆఫర్లను అందుకుంటున్నారు.







