కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రం కోబ్రా సినిమాతో రాబోతున్నారు.అజయ్ జ్ఞానముత్తు డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది.
తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.విక్రం కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు.
అందుకే ఈసారి కోబ్రాతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమా రన్ టైం చాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంది.2:55 గంటల రన్ టైం తో కోబ్రా సినిమా వస్తుంది.
ఈ సినిమాలో విక్రం మరోసారి తన నట విశ్వరూపం తో అలరిస్తాడని అంటున్నారు.కోబ్రా సినిమాలో కె.జి.ఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించింది.సినిమాలో ఆమె పాత్ర కూడా అలరిస్తుందని అంటున్నారు.మహాన్ సినిమాతో ఓటీటీలో హిట్ అందుకున్న విక్రం ఈసారి థియేటర్ లో తన సత్తా చాటాలని చూస్తున్నారు.కోబ్రా సినిమాని తెలుగులో కూడా భారీగానే రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాతో పాటుగా మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా విక్రం నటిస్తున్న విషయం తెలిసిందే.







