టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎనిమిదేళ్ల పాలనలో ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు.
అయినా, సిగ్గు లేకుండా ఓట్ల కోసం మునుగోడుకు వస్తున్నారన్నారు.రాష్ట్రంలో విపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశ్యంతో కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.







