బన్నీ ఫారిన్ వెళ్లడానికి అసలు కారణం ఇదేనా.. చిరంజీవిపై ఇష్టం లేదంటూ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి గతేడాది థియేటర్లలో విడుదలైన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

 Reasons Behind Bunny Foreign Tour Details Here Goes Viral ,bunny, Foreign Tour,-TeluguStop.com

త్వరలో అల్లు అర్జున్ పుష్ప ది రూల్ షూటింగ్ లో పాల్గొననున్నారు.పుష్ప ది రూల్ సినిమాపై కూడా భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే.

మరికొన్ని రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఉంది.ఈ నెల 22వ తేదీన చిరంజీవి బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.అయితే రెండు రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు ఉండగా బన్నీ మాత్రం ఫారిన్ టూర్ కు వెళ్లడం గమనార్హం.చిరంజీవి బర్త్ డేను స్కిప్ చేయడానికి బన్నీ ఫారిన్ టూర్ కు వెళుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరు పేరుతో కార్నివాల్ జరగనుంది.చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని ఇప్పటికే స్పష్టత వచ్చింది.ప్రస్తుతం బన్నీ కూడా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను స్కిప్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.అఫీషియల్ గా తాను మెగా హీరోను కాదని చెప్పడానికే అల్లు అర్జున్ ఈ విధంగా చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Allu Arjun, Bunny, Bunny Foreign, Carnival, Chiranjeevis, Foreign, Pawan

ఈ మధ్య కాలంలో మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది.మెగా ఫ్యాన్స్ కూడా గతంతో పోల్చి చూస్తే బన్నీకి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించేశారు.బన్నీ తర్వాత ప్రాజెక్ట్ లతో ప్రూవ్ చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.సినిమాసినిమాకు బన్నీకి క్రేజ్ పెరుగుతుండగా బన్నీ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

బన్నీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube