ఉత్తర కొరియా కిమ్. ఈ పేరు వింటేనే యుద్ధ నినాదాలు, అణు హెచ్చరికలు గుర్తు వస్తాయి.
అటువంటిది కిమ్ తన ప్రసంగంతో కంటతడి పెట్టించారు.కరోనా సమయంలో దేశానికి అండగా నిలిచిన ఆర్మీ వైద్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారిని భావోద్వేగానికి గురి చేశాయి.
దీంతో వైద్యులు వెక్కి వెక్కి ఏడ్చారు.
కరోనా విపత్కర సమయంలో కీలక సేవలు అందించిన మిలటరీ వైద్యులను సన్మానించేందుకు రాజధాని ప్యాంగ్యాంగ్ లో కిమ్ ఓ భారీ సభను ఏర్పాటు చేశారు.
ఈ సభకు వందలామంది కీలక అధికారులు, మిలటరీ వైద్యులు, ఇతర మెడికల్ సిబ్బంది దీనికి హాజరయ్యారు.కిమ్ ప్రసంగిస్తూ వారి సేవలను కొనియాడారు.కరోనాపై పోరులో ఉత్తర కొరియా సాధించిన విజయం అద్భుతమని వ్యాఖ్యానించారు.అది విన్న మిలటరీ వైద్యులు, ఇతర అధికారులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
కరోనా సమయంలో మహమ్మారితో పోరాడేందుకు కిమ్ ప్రభుత్వం ఆర్మీ వైద్యులను రంగంలోకి దింపి ‘కరోనా పోరాట ఫ్రంట్’ పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.వారిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపి కరోనాకు అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.







