టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.బాహుబలి సినిమా తరువాత ఈయన నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి.
ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ విషయంలో అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత విషయంలో మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేస్తూనే ఉంటారు.
ప్రభాస్ నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించలేదు అయితే ఈ విషయంపై అభిమానులు తరచూ నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఇకపోతే తాజాగా ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఓ వ్యక్తి అంటూ ప్రభాస్ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇలా ప్రభాస్ కి చిన్నప్పటినుంచి ఎంతో మంచి స్నేహితుడు అయిన రవి కారణంగానే ప్రభాస్ ఇలా తయారయ్యారని ప్రభాస్ తల్లి ఆ విషయాన్ని వెల్లడిస్తూ బాధపడినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నా తన స్నేహితుడు రవిని మాత్రం వదిలిపెట్టడని ప్రతిరోజు తనతో మాట్లాడుతూ ఉంటారని ప్రభాస్ అమ్మ తన సన్నిహితుల దగ్గర చర్చించినట్టు తెలుస్తోంది.

ఇకపోతే రవి వ్యక్తిగత జీవితంలో ఒక అమ్మాయిని ప్రేమించి ఫెయిల్యూర్ అయ్యారని తనకు 45 సంవత్సరాలు ఉన్న ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించలేదని తెలుస్తోంది.ఇలా ఆయన కారణంగానే ప్రభాస్ కూడా పెళ్లి గురించి ఆలోచించకుండా ఇలా తయారయ్యారంటూ ప్రభాస్ సన్నిహితుల దగ్గర ఆయన తల్లి బాధపడినట్లు వార్తలు వస్తున్నాయి.రవి నిత్యం తన లవ్ ఫెయిల్యూర్ గురించి బాధపడుతూ పెళ్లంటే భయపడేలా చెప్పడం వల్లే ప్రభాస్ కూడా పెళ్లి గురించి ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.
ఏది ఏమైనా ఈ ఏడాది కాకపోయినా మరో ఏడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని భావిస్తున్న అభిమానులకు ఈ విషయం నిజంగానే ఒక చేదు వార్త అని చెప్పాలి.







