హైదరాబాద్ రామంతాపూర్ ప్రైవేట్ కాలేజీ ఘటపై తెలంగాణ ఇంటర్ బోర్డు స్పందించింది.ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు.
కాలేజీల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని సూచించారు.కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్స్ దేనని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో, ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు తెలిపారు.అదేవిధంగా ప్రైవేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏ కారణంతోనైనా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.







