ప్రస్తుతం కొత్త కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.రొటీన్ చిత్రాలకంటే కొత్తగా ఉన్నా సినిమాలనే జనాలు ఇష్టపడుతున్నారు.
థియేటర్లో వచ్చి చూసేంత కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు.ఇలాంటి తరుణంలోనే మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటితరం ఆడియన్స్.
దర్శకనిర్మాతలు సైతం అదే కోణంలో సినిమాలు రూపొందిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు.ఇదే బాటలో ఇప్పుడు రహస్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రూపుదిద్దుకుంటోంది.75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు శివ శ్రీ మీగడ దర్శకత్వం వహిస్తుండగా.గౌతమి.
S నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇక తాజాగా ఈ చిత్రం నుంచి హీరో నివాస్ కారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో హీరో నివాస్.విశ్వతేజ అనే పాత్రలో కనిపించనున్నారు.
ఇందులో నివాస్ NIA అధికారికగా నటిస్తున్నారు.ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే నివాస్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు.
థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీని ప్రేక్షకుల ముందుంచబోతున్నారు.
SSS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించబోతోన్నారు.ఈ మేరకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం, సునీల్ కశ్యప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.జీ సెల్వ కుమార్ కెమెరామెన్‌గా, ఎస్ బి ఉద్దవ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
చిత్రంలో బుగతా సత్యనారాయణ, గెద్ద వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, వేద భాస్కర్, కారం వినయ్ ప్రసాద్, సూరి బాబు, పాండు రంగారావు, ప్రదీప్, మోడల్ శ్రీను, రాజేశ్వరి, మధు, నల్ల శ్రీను, B.T.రావ్, T.V.రామన్, A.V.ప్రసాద్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.