ఏంటీ మెగా డాటర్ పై పంచులు.. నువ్వు ఉన్నా వేస్ట్ అంటూ గాలి తీసిన హైపర్ అది?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు వారి వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే.అయితే ఎక్కువ శాతం సెలబ్రిటీలు వారి వారసులను హీరోలుగానే పరిచయం చేశారు.

 Hyper Aadi Satires On Niharika Konidela In Sridevi Drama Company , Hyper Aadi ,-TeluguStop.com

కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తన కూతురు నిహారిక ను హీరోయిన్ గా పరిచయం చేశారు.అయితే నిహారిక పలు సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా ఆమె సక్సెస్ కాలేకపోయింది.

హీరోయిన్ కాకుముందు ఆమె యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత చైతన్య ను పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత నిహారిక వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ బిజీబిజీగా గడుపుతుంది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి ఈ ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి అనే వెబ్ సిరీస్ లను నిర్మించిన విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం నిహారిక తన బ్యానర్ పై హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ నిర్మిస్తోంది.కాగా ఇందులో ఆర్యన్ రాజేష్, నిత్య శెట్టి, నిఖిల్, అనిల్ గీలా తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ కూడా శివ సాయి వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ ఓటిటిలో ఆగస్టు 12 నుంచి స్రీమింగ్ అవుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా నిహారిక శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి ఎంట్రీ ఇచ్చింది.నిహారికతో పాటుగా హలో వరల్డ్ వెబ్ సిరీస్ టీమ్ కూడా ఎంట్రీ ఇచ్చింది.

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోని సభ్యులతో కలిసి వీరందరూ తెగ సందడి చేశారు.ఇందుకు సంబంధించినప్పుడు ప్రోమోనీ తాజాగా విడుదల చేశారు.కాగా వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్ చేయనున్నారు.ఈ షోకి నిహారిక గెస్ట్ గా వచ్చింది.నిహారిక వచ్చి రావడంతోనే బర్త్ డే సెలబ్రేషన్స్ ఆయన రేంజ్ లో ఉన్నాయా లేదా చూడటానికి వచ్చాను అంటూ డైలాగ్ వేసింది.ఆ తర్వాత షోలో కొందరు చిరంజీవి పాటలకు స్టెప్పులు వేసి అలరించారు.

అనంతరం హైపర్ ఆది నిహారిక కలిసి ఒక స్కిట్ చేశారు.అప్పుడు హైపర్ ఆది నువ్వు ఒక దాదా.

నేను ఏటీఎం అని అనగా అని చెప్పగా.వెంటనే నిహారిక అందరినీ దా దా అని పిలిచేది నువ్వు ఇప్పుడు దాదా అని పిలిచేది నన్నా సెటైర్ వేసింది నిహారిక.

అప్పుడు అది త్వరలోనే హీరోగా చేస్తున్నాను అని అనగా వెంటనే నిహారిక నేను పాన్ ఇండియా మూవీ చేస్తున్నాను అని అంటుంది.అప్పుడు ఆది ఏంటి జోకా అని అడగగా.ఫస్ట్ జోక్ వేసింది ఎవడు అంటూ గాలి తీసేస్తుంది నిహారిక.ఆ తర్వాత హైపర్ ఆది భీమ్లా నాయక్ లో సాంగ్ చేశాను మామూలుగా లేదు అని అనడంతో వెంటనే నిహారిక ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన దానికి కూడా అలా చెప్పుకుంటారా అంటూ సెటైర్ వేస్తుంది.

అప్పుడు వెంటనే ఆది నువ్వు సైరా సినిమాలో చేసిన దానికంటే పెద్దదేలే అంటూ నిహారిక పరువు తీసేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube