బాలయ్య ఫాలోయింగ్ అద్భుతం.. ఆయన అలాంటి వ్యక్తి అంటున్న ఇంద్రజ?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన ఇంద్రజ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి పెద్దన్నయ్య, లయన్ సినిమాలలో నటించారు.ఒక ఇంటర్వ్యూలో ఇంద్రజ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని తెలిపారు.

 Senior Heroine Indraja Comments About Balakrishna Goes Viral In Social Media ,-TeluguStop.com

ఇదే విషయం ఎవరైనా చెబుతారని ఆమె కామెంట్లు చేశారు.బాలయ్యకు మనస్సులో ఒక మాట నాలుకపై మరో మాట ఉండదని ఇంద్రజ వెల్లడించారు.

బాలయ్య ఫాలోయింగ్ అద్భుతం అని ఇంద్రజ కామెంట్లు చేశారు.బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అని ఇంద్రజ చెప్పుకొచ్చారు.నేను సౌందర్య కలిసి మూడు, నాలుగు సినిమాలు చేశామని మేకప్ లేకపోతేనే ఆమె అందంగా ఉంటారని ఇంద్రజ కామెంట్లు చేశారు.సౌందర్య చాలా సింపుల్ గా ఉండేవారని ఇంద్రజ చెప్పుకొచ్చారు.

ఒక అగ్ర హీరో చెప్పడం వల్ల సినిమా ఆఫర్లు రాలేదని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఇంద్రజ అన్నారు.

Telugu Amma Donga, Balakrishna, Indraja, Saundarya, Senior Indraja-Movie

డైరెక్టర్ చెప్పిన హీరోయిన్ తో పోల్చి చూస్తే హీరో చెప్పిన హీరోయిన్ కొన్నిసార్లు బాగుండొచ్చు కదా అని ఇంద్రజ కామెంట్లు చేశారు.చేతి నుంచి కోటి రూపాయల ప్రాజెక్ట్ పోయినా మన మంచికే అనే భావనను కలిగి ఉంటానని ఇంద్రజ చెప్పుకొచ్చారు.ఆ భావనే మనల్ని ఇంకో ఎత్తుకు తీసుకెళుతుందని ఇంద్రజ అన్నారు.

పిల్లలు చదువుకోకుండా ఉంటే వాళ్లను స్కూల్ కు పంపడానికి ప్రయత్నిస్తానని ఇంద్రజ అన్నారు.

Telugu Amma Donga, Balakrishna, Indraja, Saundarya, Senior Indraja-Movie

దేవుడు నడిపిస్తున్నాడని నేను నడుస్తున్నానని ఇంద్రజ కామెంట్లు చేశారు.నా కెరీర్ లోని ముఖ్యమైన సినిమాలలో అమ్మదొంగ ఒకటని ఇంద్రజ తెలిపారు.కృష్ణగారు ఏమీ పట్టించుకోరని ఇంద్రజ చెప్పుకొచ్చారు.

ఒకసారి డైలాగ్ లు చెబితే చాలు కృష్ణగారు వెంటనే చెప్పేస్తారని ఇంద్రజ కామెంట్లు చేశారు.కొత్తగా వచ్చే నటీనటులకు చెప్పేంత స్థాయి నాది కాదని ఆమె అన్నారు.

ఈ జనరేషన్ అమ్మాయిలు ఇండిపెండెంట్ గా కెరీర్ ను తీర్చిదిద్దుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube