టాలీవుడ్ యాక్షన్ మూవీస్ ఎందుకు ప్లాప్ అవుతున్నాయి ?

సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ స్టార్ అవ్వాలంటే యాక్షన్ మూవీస్ మాత్రమే ఏకైక మార్గం అని బాగా నమ్ముతుంటారు.ఎలివేటెడ్ సీన్స్ తో, యాక్షన్ తో గతంలో అనేకమంది హీరోలు సూపర్ హిట్స్ కొట్టారు, కానీ ప్రస్తుతం ట్రెండు మారిపోయింది, వీరబాదుడు యాక్షన్ ని చూడాలని అభిమానులు కోరుకోవడం లేదు, కేవలం కంటెంట్ మాత్రమే ఉండాలని భావిస్తున్నారు, అందుకే పాతతరం హీరోలా అలవాట్లనే ప్రస్తుతం హీరోలు పట్టించుకోవడం లేదు, అభిమానులు అంతకన్నా పట్టించుకోవడం లేదు.

 Why These Recent Action Movies Failed At Box Office , Nitin, Rrr, Pushpa, Bimbis-TeluguStop.com

కానీ కొంతమంది హీరోలు మాత్రం ఇప్పటికీ అదే యాక్షన్ సోకాల్డ్ నమ్మకాన్ని పట్టుకొని సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటున్నారు.

ప్రేక్షకులు 10 మంది మనుషులను కొట్టే హీరోలను చూడాలని థియేటర్ కి వెళ్లే రోజులు ఎప్పుడో పోయాయి/ ఇప్పుడు అసలు అలాంటి సినిమాలు రావాలన్నా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి.

ఇటీవల కాలంలో వారియర్, కిలాడి, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుని అభిమానులను నిరాశకు గురిచేశాయి.కేవలం ఈ మూడు సినిమాలు పూర్తిగా మాస్ యాక్షన్ ఎలివేషన్స్ ని నమ్ముకుని తీయడంతో అభిమానులు తిప్పి కొట్టారు.

హీరో ఎవ్వరైనా పర్లేదు సినిమా బాగుంటుంది అనుకుంటేనే చూస్తున్నారు.అర్థంపర్థం లేని యాక్షన్స్ సన్నివేషాలను లైట్ తీసుకుంటున్నారు నేటి తరం యువత.ఈ మధ్యకాలంలో విడుదలైన అన్ని యాక్షన్ సినిమాలు ఫ్లాప్ కావడానికి ఇదే పెద్ద కారణం.

Telugu Akhanda, Bimbisara, Kgf, Kiladi, Love, Nitin, Pushpa, Rama Rao Duty, Warr

లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో ఒకప్పుడు నితిన్ తన ఇమేజ్ ని పెంచుకున్నాడు.కానీ ప్రస్తుతం యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ హీరో అవ్వాలని భావించి మాచర్ల నియోజకవర్గం వంటి ఒక మాస్ టైటిల్ తో తెర ముందుకు రాగా ఆడియన్స్ రిజక్ట్ చేశారు.అలాగే సినిమాలో ఎంతో కంటెంట్ ఉన్నప్పటికీ కేవలం యాక్షన్ నమ్ముకుని తీస్తే ఫ్లాప్ అవుతుంది అని మరోసారి ఈ సినిమా విషయంలో రుజువు అయ్యింది.

రవితేజ సైతం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో మాస్ ఎలిమెంట్స్ జోడించి థియేటర్ కి రాగానే ప్రేక్షకులు తిప్పి కొట్టారు.మితిమీరిన యాక్షన్స్ సన్నివేషాలను అస్సలు యాక్సెప్ట్ చేయకపోవడంతో రవితేజ సినిమా ఫ్లాప్ లిస్టులో చేరింది.

Telugu Akhanda, Bimbisara, Kgf, Kiladi, Love, Nitin, Pushpa, Rama Rao Duty, Warr

ఇక కిలాడి వంటి సినిమా పరిస్థితి కూడా అంతే కామెడీ ట్విస్టులు ఉన్నప్పటికీ కూడా ఆ సినిమా యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ కావడంతో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.క్రాక్ సినిమా సక్సెస్ తర్వాత రవితేజ పై ఎన్నో అంచనాలు పెంచుకొని కిలాడి సినిమాకి వెళ్లిన ప్రేక్షకుడికి మోతాదు మించిన యాక్షన్ భరించలేని పరిస్థితిని మిగిల్చింది.రామ్ లాంటి క్యూట్ బాయ్ కూడా లవర్ బాయ్ గా పేరు తెచ్చుకొని ప్రస్తుతం లింగస్వామి డైరెక్షన్ లో వారియర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా అది కూడా అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఇక కే జి ఎఫ్ సినిమాలు, ఆర్ ఆర్ ఆర్, పుష్ప, బింబిసారా, అఖండ ఇవన్నీ కూడా మంచి మాస్ కమర్షియల్ సినిమాలు.

అలాగే వీటిలో కొత్తదనంతో పాటు యాక్షన్ కూడా ఉంది అందుకే యాక్షన్ సీన్స్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా కంటెంట్ మీద కూడా కాస్త ఫోకస్ పెంచితేనే విజయాలు వరిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube