అలా అవ్వటానికి ఒక్కరాత్రి సరిపోదు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించడంతో ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు.అయితే రష్మిక ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారు.

 Rashmika Shocking Comments About Star Heroine Status Details Here , Rashmika-TeluguStop.com

తనకు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కడం గురించి తాజాగా రష్మిక మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హీరోయిన్ గా ఎదగడానికి తాను కూడా కష్టాలు పడ్డానని ఆమె తెలిపారు.

తాను ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయానని జరిగే ప్రచారంలో నిజం లేదని రష్మిక అభిప్రాయపడ్డారు.ఏడు సంవత్సరాలు కష్టపడితే నాకు స్టార్ స్టేటస్ దక్కిందని ఆమె చెప్పుకొచ్చారు.

నేను అదృష్టాన్ని వెంటబెట్టుకుని తిరగడం లేదని ఆమె కామెంట్లు చేశారు.ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో బాధలను దిగమింగుకుని ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

హీరోయిన్ కావాలంటే సహనం, పట్టుదల, ఓర్పు ఉండాలని ఆమె కామెంట్ చేశారు.

హీరోయిన్ అవ్వడానికి ఒక్క రాత్రి సరిపోదని ఆమె తెలిపారు.

భాషతో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న రష్మిక విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ గురించి కూడా స్పందించి స్పష్టత ఇచ్చారు.నేను విజయ్ దేవరకొండ స్నేహితులం మాత్రమేనని రష్మిక తెలిపారు.

ఇప్పటికే ఈ విషయాన్ని చాలాసార్లు వెల్లడించానని రష్మిక చెప్పుకొచ్చారు.తాను క్లారిటీ ఇచ్చినా అదే ప్రశ్న రిపీట్ అవుతోందని ఆమె అన్నారు.

Telugu Gossips, Rashmika-Movie

నేను నటిస్తున్న సినిమాల గురించి అడిగితే సమాధానం చెప్పగలనని ఆమె తెలిపారు.నేను సమాధానాలు చెప్పలేని ప్రశ్నలతో నన్ని విసిగొంచొద్దని ఆమె కామెంట్లు చేశారు.ప్రేమలో పడితే ఆ విషయాలను వెల్లడించడానికి అభ్యంతరం లేదని ప్రేమ, పెళ్లి చాలా పెద్ద విషయాలు అని ఆమె కామెంట్లు చేశారు.రష్మిక క్లారిటీతో ఆమె గురించి వైరల్ అవుతున్న గాసిప్స్ ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube