భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీపై ఆగంతకుడి దాడి ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఏళ్లుగా ఆయనకు ప్రాణాపాయం వున్న వేళ.
న్యూయార్క్‌లో స్టేజ్ మీద ప్రసంగిస్తుండగా రష్డీపై దాడి జరిగింది.ఈ ఘటనపై పలువురు దేశాధినేతలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు స్పందించారు.
తాజాగా బ్రిటన్ ప్రధాని రేసులో పోటీ పడుతోన్న భారత సంతతికి చెందిన రిషి సునాక్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సల్మాన్‌పై దాడిని ఇరాన్ నుంచి పశ్చిమ దేశాలకు ఒక మేల్కొలుపు కాల్‌గా పరిగణించాలని ఆయన సూచించారు.
రష్డీపై దాడికి సంబంధించి ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.అనేక కరడుగట్టిన ఇరాన్ వార్తాపత్రికలు మాత్రం దుండగుడిని ప్రశంసిస్తూ కథనాలు రాశాయని రిషి సునాక్ గుర్తుచేశారు.
రష్డీపై దాడికి గాను ఇరాన్ కనుసన్నల్లో నడిచే ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్)ని నిషేధించే వ్యవహారానికి మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు.
ఐఆర్‌జీసీ .ఇరాన్ అత్యున్నత సాయుధ, గూఢచార దళాలను నియంత్రిస్తున్న సంగతి తెలిసిందేఅణు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి ఇరాన్, పాశ్చాత్య దేశాల మధ్య నత్త నడకన సాగుతున్న చర్చలను ప్రస్తావించిన సునాక్.తమకు అత్యవసరంగా కొత్త, పటిష్టమైన ఒప్పందం , కఠినమైన ఆంక్షలు అవసరమన్నారు.ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్ధితి చాలా తీవ్రంగా వుందని సునాక్ వ్యాఖ్యానించారు.ఇకపోతే… దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన సల్మాన్ రష్దీకి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటన వల్ల ఆయన చేతి నరాలు తెగిపోగా.ఒక కన్ను కూడా కోల్పోయే ప్రమాదం వుందని వైద్యులు చెబుతున్నారు.అలాగే సల్మాన్ కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది.







