కళ్యాణ్ రామ్ హీరోగా నటించి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన బింబిసార సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే.రెండో వీకెండ్ లో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
కొన్ని నెలల గ్యాప్ లోనే నందమూరి స్టార్ హీరోలంతా వరుస విజయాలను సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ సంతోషానికి కారణమవుతోంది.
ఈ సినిమా విడుదలకు ముందే తారక్ ఈ సినిమాను చూశారనే సంగతి తెలిసిందే.
అయితే తాజాగా బాలయ్య కూడా ఈ సినిమాను చూశారు.బింబిసార మూవీ బృందంతో కలిసి బాలయ్య ఈ సినిమాను వీక్షించడం గమనార్హం.
సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ బింబిసార చాలా బాగుందని కళ్యాణ్ రామ్ కు, బింబిసార బృందానికి అభినందనలు తెలిపారని సమాచారం.బాలయ్యకు ఈ సినిమా ఎంతగానో నచ్చిందని తెలుస్తోంది.
వాస్తవానికి బింబిసార రిలీజ్ కు ముందు బాలయ్య గెస్ట్ గా ఒక ఈవెంట్ జరగనుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే బాలయ్య సోదరి ఉమా మహేశ్వరి మరణం వల్ల ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.
మరోవైపు సోషియో ఫాంటసీ సినిమాలు నందమూరి హీరోలకు కలిసొస్తున్నాయని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బింబిసార సినిమా ఇప్పటివరకు 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయని సమాచారం అందుతోంది.ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.కేథరిన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా సక్సెస్ వాళ్లిద్దరి కెరీర్ కు ప్లస్ కానుందని చెప్పవచ్చు.బింబిసార పార్ట్1 సక్సెస్ తో బింబిసార2 సినిమా రేంజ్ మారనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.







