కొన్ని సందర్భాల్లో అతి మంచితనం వల్ల మనకు మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయనే సంగతి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి వివాదాలకు, వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు.
అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి తరచూ ట్రోలింగ్ కు గురవుతూ ఉండటం గమనార్హం.చిరంజివీ తప్పు ఏ మాత్రం లేకపోయినా అభిమానులు ఆయనను తరచూ ట్రోల్ చేస్తుండటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.
ఈ నెలలో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కొంతమంది మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ సోషల్ మీడియాలో చిరంజీవిని టార్గెట్ చేయడం గమనార్హం.
మరోవైపు తాజాగా లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ అయితే ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు.సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఏ ఒక్కరి చేతిలో ఉండదు అనే సంగతి తెలిసిందే.
వేర్వేరు అంశాలు సినిమా సక్సెస్ సాధించడానికి లేదా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడానికి కారణమవుతాయి.కావాలని చిరంజీవి టార్గెట్ చేసి ట్రోల్ చేసినా అయనకు ఉన్న క్రేజ్ అణువంతైనా తగ్గదు.40 సంవత్సరాల సినీ కెరీర్ లో చిరంజీవి ఎన్నో విజయాలను సాధించారు.చెక్కు చెదరని రికార్డులను సొంతం చేసుకోవడంతో పాటు అభిమానులను చిరంజీవి ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.

చిరంజీవి సాధించిన సినిమాల మొత్తం కలెక్షన్లను ఇప్పటి కలెక్షన్ల ప్రకారం లెక్కిస్తే ఆ కలెక్షన్లు అంచనాలకు అందవు.రెమ్యునరేషన్ల విషయంలో కూడా చిరంజీవి ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు.ప్రస్తుతం చిరంజీవి రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.చిరంజీవికి మంచితనమే మైనస్ అయిందని ఆయన సహనాన్ని పరీక్షించవద్దని అభిమానులు ట్రోల్ చేసేవాళ్లను హెచ్చరిస్తున్నారు.







