ఈనెల 21న కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.తన భవిష్యత్ రాజకీయంపై పూర్తి స్పష్టతనిచ్చిన ఆయన.
తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.అనంతరం తన రాజీనామా ఊరికే పోలేదని అన్నారు.
తన రాజీనామా తరువాతే రాష్ట్రంలో చేనేత కార్మికులకు పెన్షన్లను ప్రభుత్వం ప్రకటించిందన్నారు.మునుగోడులో రోడ్ల నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయని వెల్లడించారు.







