వైరల్ వీడియో: కరాటే మాస్టర్ పైనే పంచ్ లు.. చుక్కలు చూపిస్తున్న చిన్నారి..

ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది.ఆ టాలెంట్ ని చిన్నప్పుడే గుర్తించి అందులో శిక్షణ ఇప్పిస్తే.

 Viral Video Karate Master Punches Himself , Kids , Karate , Viral Latest , News-TeluguStop.com

వారు బాగా రాణిస్తారు.కొంత మందికి యాక్టింగ్ లో, మరికొంత మందికి క్రీడల్లో ఆసక్తి ఉంటుంది.

తల్లిదండ్రులు చిన్నప్పుడే దాన్ని గుర్తించగలిగే వారికి సరైన శిక్షణ ఇప్పించేందుకు అవకాశం ఉంటుంది.అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఓ చిన్నారి తన మాస్టర్ నుంచి ఆత్మరక్షణ పాఠాలు నేర్చుకుంటోంది.ప్రాక్టీస్ లో భాగంగా ఆ చిన్నారి తన మాస్టర్ పై పంచ్ లు కురిపిస్తుంది.

తన మాస్టర్ ని నేలపై పడేసి అతని మీద ఎక్కి కూర్చుంది.మాస్టర్ పై పంచ్ లు కురిపిస్తూ చుక్కలు చూపించింది.చివరికి అతనిపై పైచేయి సాధిస్తుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కరాటే నేర్చుకోవడం కొత్తేమీ కాకపోయినా.ఆ చిన్నారి పట్టుదల, అంకితభావం నేటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.ఆమె చిన్న అమ్మాయి అయినప్పటికీ తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను పెంచుకోవడానికి తనను తాను ఎలా క్రమశిక్షణలో ఉంచుకోవాలో నేర్చుకుంది.ఈ వీడియోలో ట్రైనర్ ఆ చిన్నారికి మెళకువలు నేర్పిస్తూ, ప్రాక్టీస్ చేయిస్తున్నాడు.

ఈ వీడియో క్లిప్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.‘సో క్యూట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.ఈ చిన్నారి పంచులకు అందరూ షాక్ అవుతున్నారు.చిన్నారికి మంచి భవిష్యత్తు ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఆ చిన్నారి డెడికేషన్ చూస్తుంటే ముచ్చటేస్తుందని మరికొందరు కామెంట్ చేశారు.గతంలోనూ చిన్నారులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కానీ ఈ వీడియో మాత్రం స్పెషల్ అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube