ఈనెల 21వ తేదీన తెలంగాణ రాజకీయాల్లో కీలక సన్నివేశాలు చోటుచేసుకోబోతున్నాయి.ముఖ్యంగా ఆ తేదీన ఇతర పార్టీల నుంచి బిజెపిలోకి చేరికలు ఉండబోతూ ఉండడంతో, ఏ పార్టీ నుంచి ఎవరెవరు బిజెపిలో చేరబోతున్నారనే టెన్షన్ మొదలైంది.
ముఖ్యంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు ఈ విషయంలో బాగా టెన్షన్ పడుతున్నాయి.ఈనెల 21వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు.
చౌటుప్పల్ లో బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు.అమిత్ షా సభలోనే భారీ ఎత్తున చేరికలకు బిజెపి ప్లాన్ చేసింది.
ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు, మరి ఎంతోమంది కీలక నాయకులు బిజెపి కండువా కప్పుకోబోతున్నారు.దీంతో రాజగోపాల్ రెడ్డి తో పాటు , ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు ఎవరు పార్టీని వీడబోతున్నారు ? రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గాల నుంచి చేరికలు ఉండబోతున్నాయి అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ తదితర పార్టీలలోని అసంతృప్త నాయకులను బిజెపి గుర్తించింది వారితో మంతనాలు చేసింది.ఈనెల 21వ తేదీన అమిత్ షామీక్షంలోనే వారందరినీ బిజెపిలో చేర్చుకునే ప్లాన్ కు వ్యూహం రచించింది.
చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటెల రాజేందర్ కొద్దిరోజులుగా ఇదే పనిలో ఉన్నారు.అయితే ఎవరెవరు పార్టీ మారబోతున్నారనే విషయంలో ఎక్కడ లీకులు బయటకు రాకుండా ఆయన జాగ్రత్త తీసుకున్నారు.
దీంతో కాంగ్రెస్ టిఆర్ఎస్ లు టెన్షన్ పడుతూ ఉండడంతో పాటు, తమ పార్టీలోని అసంతృప్త నాయకులు ఎవరెవరు బిజెపి టచ్ లోకి వెళ్లారు అనే విషయంపై సమగ్రంగా ఆరా తీస్తున్నాయి.అయితే ఈ విషయంలో మరో అనుమానం టిఆర్ఎస్ కాంగ్రెస్ లో నెలకొంది.

నిజంగానే పెద్ద ఎత్తున తమ పార్టీలోని నాయకులు వెళ్తున్నారా లేక బిజెపి మైండ్ గేమ్ ఆడుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు, వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు తదితరులు బిజెపిలో చేరబోతున్నారు.వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ చేరికలు ఉంటాయని కమలనాధులు ప్రకటించారు.ఈ మేరకు ఒక జాబితాను కూడా రూపొందించుకున్నారు.ఈ జాబితాను ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి పంపించారు.ఆ లిస్ట్ చూసిన తర్వాతే ఆమెకు తెలంగాణకు వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వేలు నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల పరిస్థితి పై సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు ఒక అంచనాకు వస్తూ సర్వేల్లో అనుకూల ఫలితాలు రాని నేతలకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు, ఇప్పటికే కొంతమందికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని పిలిచి మరి చెప్పేయడం తదితర కారణాలతో టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నాయకులు చాలామంది అసంతృప్తితో ఉన్నారట.వారంతా ఇప్పుడు బిజెపిని ఆప్షన్ గా చూస్తుండడంతో ఈనెల 21వ తేదీన భారీగానే చేరుకులు ఉంటాయని అన్ని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి.
.






