కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటులుగా కొనసాగుతున్న హీరోలు సూర్య కార్తీ గురించి పరిచయం అవసరం లేదు.వీరిద్దరికి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇకపోతే తాజాగా సూర్య నిర్మాణంలో కార్తి హీరోగా నటించిన ‘వీరుమాన్’ నేడు తమిళంలో విడుదల అయింది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో కార్తీ తన అన్నయ్య సూర్య గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
హీరో సూర్య తన తమ్ముడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఆయన తన వెన్నంటే ఉండి తనని ప్రోత్సహిస్తున్నాడు.
ఈ క్రమంలోనే కార్తీ నటించిన చినబాబు సినిమాని కూడా సూర్య నిర్మించడం గమనార్హం.
ఇలా ప్రతి ఒక్క అడుగులోను సూర్య తన తమ్ముడి వెంట ఉండి నడిపిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కార్తీ సూర్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తనకు తన అన్నయ్య రాముడితో సమానమని, నేను లక్ష్మణుడిలా ఆయన వెంటే ఉంటాను ఆయన నా ముందు ఉంటే నాకెంతో ధైర్యంగా ఉంటుంది అంటూ తెలిపారు.

ఇకపోతే కార్తీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు తన అన్నయ్య కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నానని తెలిపారు.వీలైతే తన దర్శకత్వంలో అన్నయ్యతో సినిమా చేస్తానని అలా ఆయన రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా కార్తీ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.అయితే కార్తీ సూర్య కోసం ఒక బయోపిక్ చిత్రం సిద్ధం చేసుకున్నారని అయితే ఆ బయోపిక్ సినిమా ఎవరిది ఏంటి అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలని తెలుస్తోంది.







