తెలుగు ఓటీటీ మాధ్యమాల్లో అగ్రగామిగా కొనసాగుతోన్న ఆహా.ఇప్పుడు ఆహా గోల్డ్‌ను లాంఛ్ చేసింది.
ఈ ప్రీమియంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్‌లో హై క్వాలిటీలో 4కె అల్ట్రా హెచ్‌డీ వీడియోలను స్ట్రీమింగ్ ద్వారా అందించనుంది.ఇది డాల్బీ సౌండ్‌లో కస్టమర్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది.
వార్షిక సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్నవారందరూ ఇప్పుడు ఆహాలో కొత్తగా రిలీజ్ అవుతోన్న సినిమాలు, టీవీ షోస్, ఓరిజినల్ కంటెంట్‌ను తెలుగు, తమిళ భాషల్లో వీక్షించవచ్చు.అది కూడా ఎలాంటి యాడ్స్ లేకుండా.
కస్టమర్స్ ప్రాధాన్యతను గుర్తించి దాన్ని మరింతగా పెంపొందించడమే అంతిమ లక్ష్యంగా ఆహా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.అంతే కాకుండా.కస్టమర్స్ స్మార్ట్స్ టీవీల్లోతమకు ఇష్టమైన కంటెంట్‌ను వీక్షించే సమయంలో ఆ అనుభూతిని మరింత పెంచడం కూడా ఈ లక్ష్యంలో భాగమే.100 శాతం లోకల్ కంటెంట్, సరికొత్త సాంకేతికత కాంబినేషన్‌తో ఆహా ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించడానికి సిద్ధమవుతోంది.
‘ఆహా గోల్డ్’గా మారుతున్న ఆహా ప్రీమియమ్ లాంఛింగ్ వేడుకను ఆగస్ట్ 10న భారీ ఎత్తున నిర్వహించారు.అందులో భాగంగా ఆహాలో విడుదలై ఘన విజయం సాధించటమే కాకుండా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న చిత్రం కలర్ ఫొటోను 4కె అల్ట్రా, డాల్బీ సిస్టమ్ సౌండ్‌తో ప్రదర్శించారు.
ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో .ఆహా గోల్డ్ లోగోను కలర్ ఫొటో టీమ్ ఆవిష్కరించింది.
ఆహా బిజినెస్ హెడ్ కార్తీక్ మాట్లాడుతూ ‘‘తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆహాను ఎంతగానో ఆదరించారు.
ఓటీటీలో సినిమాలను మరేదైనా కంటెంట్‌ను ఎంజాయ్ చేస్తోన్న వీక్షకులు తమ టీవీలు, హోం థియేటర్స్‌లో బెటర్ ఎక్స్‌పీరెయన్స్‌ను కోరుకుంటున్నారని మాకు తెలిసింది.దాన్ని వారికి అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ వచ్చాం.అదే ఆహా గోల్డ్ రూపంలో ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తున్నాం.4కె, అల్ట్రా హెచ్ డి, డాల్బీ ఆడియోలో ఆహా గోల్డ్ ప్రేక్షకులను మెప్పించనుంది.అదే సమయంలో ఆహా 100 % లోకల్ తెలుగుతో పాటు తమిళ లోకల్‌ను కూడా లాంఛ్ చేశాం.ఆహా గోల్డ్‌లో ఈ రెండు ప్యాక్‌లను చూడొచ్చు.ఆహా గోల్డ్ క్యాంపెయిన్‌లో సపోర్ట్ చేమయని అడిగినప్పుడు అనిల్ రావిపూడిగారు, ప్రశాంత్ వర్మగారు చిన్నపాటి చిత్రీకరణను మాకోసం చేసి పెట్టారు.అందుకు వారికి థాంక్స్.
మా ఆహాలో రిలీజైన కలర్ ఫొటోకి నేషనల్ అవార్డ్ రావటం చాలా సంతోషంగా ఉంది.అందుకే ఈ సినిమాను ఈరోజు స్క్రీనింగ్ చేశాం.భవిష్యత్తులోనూ మంచి కంటెంట్‌ను థియేటర్స్‌లోనూ ఆహా గోల్డ్ స్క్రీనింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం’’ అన్నారు.
ఆహా సి.ఇ.ఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ ‘‘మా ఆహకు అద్భుతమైన కస్టమర్ బేస్ ఉంది.వీరందరికీ ఆహా గోల్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది.మా తెలుగు, తమిళ కస్టమర్స్ మంచి క్వాలిటీ ఉన్న కంటెంట్‌ను కోరుకుంటున్నారు.అలాంటి క్వాలిటీ కస్టమర్స్‌కు వారి టీవీల ద్వారా మా ఆహాను వీక్షిస్తున్నప్పుడు అద్భుతమైన కంటెంట్‌ను అందిచటమే లక్ష్యంగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.దీనికి సంబంధించి ఇది వరకే మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అంతే కాకుండా మా వార్షిక ప్రీమియమ్ ప్రేక్షకుల కోసం క్వాలిటీ సర్వీస్‌ను అందించటానికి అడుగులు వేస్తున్నాం.భవిష్యత్తులో గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కోసం మరిన్ని ఆసక్తికరమైన ఆఫర్స్‌ను అందించబోతున్నాం’’ అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన ప్రేక్షకులందరి కోసం రీసెంట్‌గా జాతీయ అవార్డును గెలుచుకున్న చిత్రం కలర్ ఫొటోతో పాటు ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆహాలో అందుబాటులో ఉన్నాయి.వాటిలో క్రాక్, భీమ్లా నాయక్, లవ్‌స్టోరి వంటి చిత్రాలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న రైటర్, మా మణిదన్ వంటి తమిళ చిత్రాలు 4కె అల్ట్రా హెచ్‌డి, డాల్బీ ఆడియోలో అందుబాటులో ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో భాగమైన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి ఒక్కరూ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని కోరారు.ఆహా గోల్డ్ ప్రీమియమ్‌లో మరో దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా భాగమయ్యారు.
ఆహా గోల్డ్ ప్రీమియర్ ప్యాక్ లాంఛింగ్‌లో జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం కలర్ ఫొటోను ప్రదర్శించారు.కార్యక్రమంలో సుహాస్, సునీల్, చాందిని చౌదరి, సందీప్, వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు.