మరోమారు చైనాకి షాక్ ఇవ్వబోతున్న ఇండియా... స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్ని బ్యాన్ చేయనుంది!

అవును.మరోమారు చైనాకి ఇండియా షాక్ ఇవ్వబోతోంది.

 Indian Government To Ban Chinese Smart Phones Below 12k Price Rate Details, Chin-TeluguStop.com

ఇండియన్ గవర్నమెంట్ చైనా ఉత్పత్తులపై మరో కీలక నిర్ణయం తీసుకోనుంది.చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరర్ల నుంచి ఉత్పత్తి అయిన రూ.12వేలు అంతకంటే తక్కువ విలువైన ఫోన్ల అమ్మకాల్ని త్వరలో నిషేదించబోతోంది.ఫలితంగా ఇండియాలో తయారైన లావా, మైక్రోమ్యాక్స్ లాంటి ఉత్పత్తులకు మరింత డిమాండ్ ఏర్పడే వీలుంది.చైనీస్ స్మార్ట్‌ఫోన్ మ్యాన్యుఫ్యాక్చర్ ప్రస్తుతం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ అయిన రూ.15వేలు అంతకంటే తక్కువను డామినేట్ చేసేసింది.

వాటితో పాటు మరి కొంత మేర శాంసంగ్ లాంటి చైనాయేతర ఉత్పత్తులు కూడా ఇండియన్ మార్కెట్లో స్థానం సంపాదించుకున్నాయి.అలా చేయడం వల్ల కొన్నేళ్లుగా పాతుకుపోయిన షియోమీ, పోకో, రియల్మీ లాంటి బ్రాండ్లపై దారుణమైన ప్రభావమే కనపడనుంది.

కొద్దికాలం నుంచి మాత్రం ఇండియా.చైనాల మధ్య గొడవ తీవ్రత తగ్గింది.

కాకపోతే చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఈ ప్రభావం భారీగా కనిపించింది.కొన్ని నెలలుగా చైనీ కంపెనీలైన షియోమీ, వివో, ఒప్పోల కంపెనీలపై ట్యాక్స్ అంశంలో ఈడీ ఛార్జ్ విధించింది.

Telugu China, India, Indian, Oppo, Redmi, Ups, Vivo, Xiaomi-Latest News - Telugu

రీసెంట్‌గా మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వీవో బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసిందనే విషయం విదితమే.కాగా ప్రస్తుతం రూ.12వేల కంటే తక్కువ స్మార్ట్ ఫోన్లను నిషేదించాలని అనుకుంటున్న ఇండియన్ మార్కెట్.పబ్ జీ, టిక్ టాక్ లాంటి మొబైల్ యాప్‌లను నిషేదించినట్లుగానే చేస్తుందా లేదా ఇతర ఏదైనా విధానం అవలంబిస్తుందో చూడాలి.

ఇక ఈ నిర్ణయం వలన పది వేలు లోపు మొబైల్ కొనాలకున్నవారికి ఓ రకంగా షాకిచ్చినట్టే.ఈ ధరలో మన ఇండియన్ మొబైల్స్ వున్నపటికే వాని పనితీరు గురించి అందరికీ తెలిసినదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube