బర్త్ డే విషెష్ తో సోషల్ మీడియా షేక్.. మహేష్ ఫ్యాన్స్ హంగామా..

మన తెలుగు వారి అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఒక్కసారి ఏ హీరోకు అయినా ఫ్యాన్ అయినారంటే ఇక వారిని ఎంతగా అభిమానిస్తారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.ఇక వారి పుట్టిన రోజులను ఎంతగా సెలెబ్రేట్ చేస్తారో కూడా చూస్తూనే ఉంటాం.

వారి పుట్టిన రోజులకు కూడా అంతా హంగామా చెయ్యరు.కానీ తమ హీరో పుట్టిన రోజు అంటే మాత్రం ఒక నెల ముందు నుండే హంగామా స్టార్ట్ అవుతుంది.

మరి మన టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ చార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు అంటే ఇంకా ఎంత హంగామా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.కొన్ని రోజుల నుండి ఈయన పుట్టిన రోజు కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు.

Advertisement

మరి వారి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.దీంతో ఫ్యాన్స్ తమ హంగామా స్టార్ట్ చేసారు.

సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.వీరి హంగామా కు సోషల్ మీడియా సైతం షేక్ అవుతుంది.ఈయన పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ కోసం మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలైనా పోకిరి, ఒక్కడు సినిమాలను మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఈ రీ రిలీజ్ లకు కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ లభించింది.ఏ హీరోకు సాధ్యం కానీ విధంగా నెవర్ బిఫోర్ గా ఈయన సినిమా రీ రిలీజ్ లకు రెస్పాన్స్ వస్తుంది.ఇన్ని రికార్డులను సాధించిన ఘనత కేవలం మహేష్ బాబు కె దక్కింది అని చెప్పాలి.

ఇక ఈయన పుట్టిన రోజు సందర్భంగా నిన్న సాయంత్రం నుండే సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.సూపర్ స్టార్ ముందు ముందు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుతూ తెలుగు స్టాప్ యూనిట్ నుండి కూడా మహేష్ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు