హెలికాప్టర్‌కు వేలాడుతూ పుల్‌అప్స్.. ఎంతైనా నువ్వు గ్రేట్ బాసూ!

నలుగురికీ నచ్చినది.నాకసలే నచ్చదరో అనే సాంగ్ మీరు వినే ఉంటారు.

 Fitness Youtuber Breaks Guinness World Record By Doing 25 Helicopter Pull-ups,pu-TeluguStop.com

అయితే నిజజీవితంలోనూ అలాంటి వారు మనకు తారస పడుతుంటారు.ఏదైనా పనిని నలుగురు చేసేలా కాకుండా విభిన్నంగా చేస్తూ, ప్రత్యేకత చాటుకుంటుంటారు.

ఇదే కోవలో ఓ యువకుడు ప్రయత్నించాడు.ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలో చోటు దక్కించుకున్నాడు.

సాధారణ ప్రస్తుత రోజుల్లో యువతకు సిక్స్ ప్యాక్ బాడీపై మోజు ఉంటుంది.అందు కోసం జిమ్‌లోనూ, మైదానాలలోనూ కసరత్తులు చేస్తుంటారు.

అలాంటి కసరత్తులలో పుల్ అప్స్ కూడా ఒకటి.అందరిలా సాధారణ పుల్-అప్‌లలో ఏమి థ్రిల్ ఉంటుందని ఓ యువకుడు అనుకున్నాడు.

ఆ తర్వాత హెలికాప్టర్‌‌కు వేలాడుతూ గాలిలో పుల్ అప్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

స్టాన్ బ్రౌనీ అనే వ్యక్తి, తోటి అథ్లెట్ అర్జెన్ ఆల్బర్స్‌తో కలిసి యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు.జూలై 6, 2022న బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌లోని హోవెనెన్ ఎయిర్‌ఫీల్డ్‌లో అతడు గిన్నిస్ రికార్డ్‌ను బద్దలు కొట్టారు.ఇద్దరు అథ్లెట్లు ఈ ఛాలెంజ్‌కి సిద్ధమయ్యారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన యూట్యూబ్ హ్యాండిల్‌లో ఈ రికార్డ్-బ్రేకింగ్ అచీవ్‌మెంట్ యొక్క వీడియోను షేర్ చేసింది.ఆల్బర్స్ ముందుగా వెళ్లి, ఒక హోవర్ హెలికాప్టర్ నుండి 24 పుల్-అప్‌లను ప్రదర్శించగా, స్టాన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.ఒక నిమిషంలో 25 పుల్-అప్‌లను ప్రదర్శించాడు.

అలా చేయడం ద్వారా, 23 పుల్-అప్‌లను కలిగి ఉన్న అర్మేనియన్ సీరియల్ రికార్డ్ బ్రేకర్ రోమన్ సహ్రద్యన్ పేరిట ఉన్న రికార్డును వీరిద్దరూ బద్దలు కొట్టారు.అంతకుముందు, ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ స్కాలీ అనే అథ్లెట్ ఒక గంటలో 3,182 పుష్-అప్‌లు చేసి అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

ఒక గంటలో అత్యధిక పుష్-అప్‌లు (పుష్-అప్‌లు) సాధించిన ప్రపంచ రికార్డును సాధించడానికి మునుపటి రికార్డు హోల్డర్ కంటే మనిషి 100 పుష్-అప్‌లను ఎక్కువగా ప్రదర్శించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube