రామారావు ఆన్ డ్యూటీ.. పారితోషికం మొత్తం వెనక్కి ఇచ్చేసిన రవితేజ?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ తాజాగా నటించిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.

 Ravi Teja Takes Sensational Decision Returned His Ramarao On Duty Remuneration ,-TeluguStop.com

ఇటీవల జూలై 29న ఈ సినిమా విడుదల ఊహించిన విధంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాకు గాను రవితేజ 15 కోట్ల పారితోషకం అందుకున్నాడట.

అయితే రవితేజ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.అదేమిటంటే రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు గాను అతను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కనుక నిజమైతే నిర్మాతలకు మంచి రోజులు వచ్చినట్టే అని చెప్పవచ్చు.

ఎందుకంటే ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి అంటూ ఫిలిం ఛాంబర్ చర్చలు జరుపుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇదే విషయం గురించి గత కొద్ది రోజులుగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి.ఇటువంటి సమయంలో రవితేజ తీసుకున్న నిర్ణయం నిజంగా అందరికీ ఆదర్శం అని చెప్పవచ్చు.అయితే రవితేజ హీరోగా నటిస్తూనే తన సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్ బ్యానర్ లపై రామారావు ఆన్ డ్యూటీ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా అందులో ఫస్ట్ వీక్ కేవలం రూ.5 కోట్ల కలెక్షన్ మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది.

Telugu Rama Rao Duty, Ravi Teja, Return, Tollywood-Movie

అయితే సినిమా విడుదలైన ప్రతి ఏరియాలోనూ కలెక్షన్లు వీక్‌గానే ఉండటంతో ఫుల్ రన్ ముగిసే సరికి దాదాపు రూ.13 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో తను కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన కారణంగా రవితేజ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడట.అయితే గతంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా తన సినిమాలు సరిగా ఆడనప్పుడు తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసేవాడని, లేదంటే మరో సినిమా ఆ నిర్మాతకి చేస్తానని మాటిచ్చేవాడని టాక్ ఉండేది.

కాగా ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర,ధమాకా లాంటి చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube