తమ చిత్ర ప్రచారం కోసం హైదరాబాద్‌ వచ్చి సందడి చేసిన ‘రక్షాబంధన్‌ ’ బృందం

ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ యొక్క తాజా చిత్రం, బంధాలను మనోహరంగా చూపించిన ‘రక్షాబంధన్‌’ చిత్ర బృందం, తమ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు నగరాలలో సందడి చేస్తున్నారు.రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా విడుదల కాబోయే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఈ బృందం హైదరాబాద్‌ వచ్చింది.

 'raksha Bandhan' Team Visits Hyderabad For Movie Promotion! , Bhumi Padnekar, A-TeluguStop.com

తమ బహుళ నగర ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఈ చిత్ర బృందం దుబాయ్‌, పూనె, ఇండోర్‌లలో సందడి చేసింది.ఈ బృందంలో అక్షయ్‌కుమార్‌, నిర్మాత ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ మరియు చిత్ర తారాగణంలో సాడియా ఖతీబ్‌, స్మృతి శ్రీకాంత్‌, సహేజ్మీన్‌ కౌర్‌, దీపికా ఖన్నాలు హైదరాబాద్‌ విచ్చేశారు.

ఇండోర్‌ పర్యటన తరువాత, ఈ చిత్ర బృందం హైదరాబాద్‌కు వచ్చింది.పీవీఆర్‌ లో మీడియా సమావేశంలో పాల్గొన్న వీరు అనంతరం చార్మినార్‌ వద్ద సందడి చేశారు.

హైదరాబాద్‌కు తలమానికమైన చార్మినార్‌ వద్ద ఫోటోలనూ దిగారు.తమ అభిమాన సూపర్‌స్టార్‌ తో పాటుగా చిత్ర బృందాన్ని దగ్గరగా చూసేందుకు, వారితో ముచ్చటించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలను జీ స్టూడియోస్‌తో కలిసి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ మరియు హిమాంశు శర్మ, అల్కా హిరానందానీ, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ తీసుకున్నాయి.హిమాంశు శర్మ మరియు కనికా ధిల్లాన్‌లు రచన చేయగా, రక్షాబంఽధన్‌కు సంగీత దర్శకత్వంను హిమేష్‌ రేష్మియా చేశారు.

ఈ చిత్రంలోని పాటలకు సాహిత్యాన్ని ఇర్షాద్‌ కమిల్‌ అందించారు.

రక్షా బంధన్‌ చిత్రంలో భూమి పద్నేకర్‌, అక్షయ్‌కుమార్‌, నీరజ్‌ సూద్‌, సీమా పహ్వా, సాదియా ఖతీబ్‌, అభిలాష్‌ థపిల్యాల్‌, దీపికా ఖన్నా, స్మృతి శ్రీకాంత్‌ మరియు సహెజ్మీన్‌ కౌర్‌లు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రం ఆగస్టు 11, 2022 న విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube