యూజర్స్ కి ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ గుడ్ న్యూస్ అందించింది.అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పై అధికారిక ప్రకటన చేసింది.
ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు ఈ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఉంటుంది.ఈ సేల్ లో అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు అమెజాన్ రెడీ అయ్యింది.
వివిధ కేటగిరీల్లో అనేక ఆఫర్లు, తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.ఈ సేల్ లో కొత్త ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను మంచి డిస్కౌంట్ లో కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది.ఆగస్టు 10 వరకు ఈ సేల్ కొనసాగుతుంది.ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ఉపకరణాలపై 40 శాతం తగ్గింపు ఉంటుంది.ప్రారంభస్థాయి ఫోన్ ని రూ.6,599లకే దక్కించుకోవచ్చు.ఇక ఈ ఫ్రీడమ్ సేల్ లో కొత్త ఫోన్ కూడా లాంచ్ కానుంది.
OnePlus 10T, iQOO 9T అమెజాన్ లో అమ్మాకానికి అందుబాటులోకి రానుంది.దీంతోపాటు Redmi K50i 5Gపై భారీ డిస్కౌంట్ లభించనుంది.
ఈ సేల్ లో ఆమెజాన్ యూజర్స్ కి 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోంది.మరికొన్ని వస్తువుల కొనుగోలుపై ఎస్బీఐ క్రిడిట్ కార్డుతో 10 శాతం డిస్కౌంట్ దక్కుతుంది.
ఈ సేల్ లో Samsung Galaxy M13, iQOO Neo 6 5G, Tecno Camon 19 Neo ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.ఇక అమెజాన్ అలెక్సా, కిండ్ల్, ఫైర్ స్టిక్ వంటి ఇంటి పరికరాలపై 45 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.కొన్ని ల్యాప్ టాప్స్ పై రూ.40 వేల వరకు తగ్గింపు ఇస్తున్నారు.అంతేకాదు కొత్త ల్యాప్ టాప్ లు కూడా ఈ సేల్ లో అమ్మకానికి పెట్టారు.అమెజాన్ బ్రాండ్ ప్రొడక్ట్స్ పై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది.
ఈ సేల్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది.







