ప్రస్తుత రోజుల్లో ఏవైనా ఇతర దేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా విమాన ప్రయాణం చేయాల్సిందే.ఒకప్పుడు అయితే సముద్ర ప్రయాణం మాత్రమే చేసే వారు.
ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు.ఖచ్చితంగా విమానాల ద్వారానే వెళ్లాల్సిన పరిస్థితి.
ఎంత పేద దేశమైనా కనీసం వారి రాజధానుల్లో ఒక విమానాశ్రయమైనా ఉంటుంది.అయితే నేటికీ కొన్ని దేశాల్లో విమానాశ్రం అంటూ లేదు.
ఆ దేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా పక్క దేశంలో దిగి, రోడ్డు మార్గంలో అక్కడికి వెళ్తుండాలి.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
వాటికన్ సిటీ అంటే తెలియని వారు ఉండరు.ప్రపంచంలోని రోమన్ క్యాథలిక్ క్రైస్తవులకు మత పెద్దగా వ్యవహరించే పోప్ ఇక్కడే ఉంటారు.ఈ వాటికన్ సిటీ రోమ్ మధ్యలో 109 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.అందుకే వాటికన్ సిటీకి ప్రత్యేకంగా ఎయిర్ పోర్టు లేదు.కానీ సందర్శకులు ఇటలీ రాజధాని ద్వారా సులభంగా చేరుకోవచ్చు.అదేవిధంగా శాన్ మారినో కూడా ఇటాలియన్ భూమితో చుట్టుముట్టబడి ఉంది.ప్రపంచంలోని ఐదవ అతి చిన్న దేశం.33,000 కంటే కొంచెం ఎక్కువ మంది జనాభాను కలిగి ఉంది.ఇటలీలోని రిమినిలోని ఫెడెరికో ఫెల్లిని అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం తొమ్మిది మైళ్ల దూరంలో ఉంది.మొనాకో దేశాన్ని చూడాలనుకుంటే మీరు ఫ్రాన్స్‌లోని నైస్ కోట్ డి’అజుర్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా వెళ్ళాలి.
ఇది మొనాకో నుండి కేవలం 25 నిమిషాల కారు ప్రయాణంలో ఉంది.ఇది జనాభా కేవలం 38,500. లిచెన్‌స్టెయిన్ దేశానికి వెళ్లాలంటే దానికి 24 మైళ్ల దూరంలో ఉన్న స్విట్జర్లాండ్‌లోని సెయింట్ గాలెన్-ఆల్టెన్‌ర్హెయిన్ విమానాశ్రయం గుండా వెళ్లాలి.ఇవి కాకుండా అండోరా అనే అందమైన దేశానికి కూడా విమానాశ్రయం లేదు.
ఈ దేశం సుందరమైన ప్రకృతికి నిలయం.చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
అయితే ఎయిర్ పోర్టు మాత్రం లేదు.పర్వతశ్రేణులు, లోయలు ఉండడంతో విమానాశ్రయం నిర్మించడం సాధ్యం కాదు.
కాబట్టి సందర్శకులు అండోరాకు ఇరు వైపులా ఉన్న స్పెయిన్ లేదా ఫ్రాన్స్ ద్వారా చేరుకోవచ్చు.అండోరా రాజధానికి స్పెయిన్‌లోని గిరోనా-కోస్టా బ్రావా విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది.
చివరగా, పాలస్తీనా భూభాగాల్లో నేరుగా విమానాశ్రయాలు లేవు.కానీ ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం బెత్లెహెమ్ నుండి కేవలం 26 మైళ్ల దూరంలో ఉంది.







