సాధారణంగా చిన్న పిల్లలను కారు గానీ బైక్‌పై గానీ తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.వారిని ప్రతి క్షణం కాపాడుకుంటూ ఉండాలి.
లేదంటే వారి ప్రమాదాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.కానీ ఒక వ్యక్తి మాత్రం ఒక చిన్నారిని అస్సలు పట్టించుకోలేదు.
అతడు ఆమెను గాలికి వదిలేయడంతో ఆ చిన్నారి కారు విండో లో నుంచి కింద పడిపోయింది.అదృష్టవశాత్తు ఆ సమయానికి కారు ఒక రెడ్ లైట్ వద్ద ఆగి ఉంది.
లేదంటే రన్నింగ్ లోనే ఆ బాలిక కింద పడిపోయేది.దీని వల్ల ప్రాణాలే పోయేవి.
అయితే ఈ బాలిక కింద పడటం గమనించిన మిగతా వాహనదారులు పరుగు పరుగున వచ్చి ఆమెను రెస్క్యూ చేశారు.దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.
చైనాలోని నిగ్‌బో సిటీలో ఒక బిజీ రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో చాలా వాహనాలు ఆగిపోయాయి.ఇక్కడే ఆగి ఉన్న ఒక కారు విండో నుంచి ఒక చిన్నారి బయటకి వచ్చింది.
అలా బయటకు వచ్చిన చిన్నారి ఒక్కసారిగా కిందపడిపోయింది.ఆలోగా సిగ్నల్ పడటం వాహనాలన్ని ముందుకు కదిలాయి.
ఆ చిన్నారి పడిపోయిన విషయాన్ని ఆ కారులో ఉన్న వారు ఎవరూ గుర్తించలేదు.అందుకే వారు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు.కానీ వెనుక వచ్చే వాహనదారులు వెంటనే అప్రమత్తమయ్యారు.తమ వాహనాలను ఆపేసిన వాహనదారులు ఆపిల్ల వద్దకు పరుగున పరుగున వెళ్లారు.
అనంతరం ఆ బిడ్డను కాపాడారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







