భారత క్రికెట్ జట్టు ఆటగాడు సురేశ్ రైనా పరిచయం అక్కర్లేదు.అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవలే సురేష్ రిటైరైన సంగతి తెలిసినదే.
అయినా ఇప్పటికీ అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని తాజాగా నెట్టింట్లో వైరల్ అయిన ఓ వీడియోనే చెబుతోంది.సదరు వీడియోని చూసి హీరోల అభిమానులే అవాక్కవుతున్నారు.
ఎందుకంటే సురేష్ రైనా అభిమానులు సురేష్ రైనాపై చూపించిన అభిమానం అలాంటిది.
వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, ఇందులో సురేష్ రైనా వీరాభిమాని రైనా ఫొటోను పూజిస్తూ కనిపించాడు.
అవును.మొదట అతగాడు ఆ ఫోటోకి హారతి ఇచ్చాడు.
ఆ తరువాత పాలాభిషేకం చేసాడు.అచ్చం తెలుగు హీరోలకైతే అభిమానులు ఏ విధంగా చేస్తారో అలాగే చేసాడు.
దాంతో వీడియో చూసినవారికి ఈ విషయం చాలా క్రేజీగా అనిపిస్తోంది.విషయం ఏమంటే ఈ వీడియోను రైనా ట్విట్టర్‌లో చూసి రీట్వీట్ చేశాడు.

ఇక ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను రైనా అభిమాని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.దీన్ని ట్విట్టర్‌లో 1000 మందికి పైగా లైక్ చేశారు.కాగా దాదాపు 200 మంది దీనిని రీట్వీట్ చేయడం విశేషం.రైనా టీమ్ ఇండియా తరపున 226 వన్డేల్లో 5615 పరుగులు చేశాడు.ఈ సమయంలో అతను 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలు సాధించాడు.78 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 1604 పరుగులు చేశాడు.ఈ ఫార్మాట్‌లో అతను ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు సాధించాడు.








