ప్రెసెంట్ రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’.ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.
ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పలు వాయిదాల తర్వాత రిలీజ్ అయినా ఈ సినిమా నెగిటివ్ టాక్ వచ్చింది.
ఖిలాడీ తర్వాత రవితేజ నుండి వచ్చిన సినిమా కావడంతో ముందు నుండి ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవు.రిలీజ్ ముందు హైప్ వచ్చిన రిలీజ్ తర్వాత వచ్చిన టాక్ తో ప్రేక్షకులు థియేటర్స్ దగ్గరకు వెళ్లి చూడడానికి ఆసక్తి చూపించడం లేదు.
ఇక ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కూడా కీలక పాత్రలో నటించిన విషయం విదితమే.
హీరోగా ఈయన చేసిన సినిమాలు చాలానే సక్సెస్ సాధించాయి.
అయితే గత కొన్నేళ్లుగా కనుమరుగు అయినా ఈ హీరో మళ్ళీ రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.అయితే ఈయన ఎంట్రీ విషయంలో ఈ సినిమా టీమ్ పెద్దగా జాగ్రత్తలు తీసుకున్నట్టు లేదు.
అందుకే వేణు రీ ఎంట్రీ బెడిసికొట్టింది.ఈయన ఎంట్రీ విషయంలో కొత్తగా ట్రై చేసి బోల్తా కట్టారు.

వేణు సొంత డబ్బింగ్ చెప్పడం పెద్ద ప్రయోగమే.ఈయన ప్రొమోషన్స్ లో పాల్గొన్నప్పుడు వేణు వాయిస్ వినే అందరు షాక్ అయ్యారు.ఇప్పటి వరకు సినిమాల్లో ఈయనకు డబ్బింగ్ తో మ్యానేజ్ చేసినట్టు ఇప్పుడు బయట పడింది.కానీ రామారావు ఆన్ డ్యూటీ లో మాత్రం డబ్బింగ్ ట్రై చేయకుండా సొంత గొంతుతో వాయిస్ చెప్పించడం ప్రేక్షకులకు రుచించలేదు.
ఈ సినిమా ఎలాంటి టాక్ వచ్చిన ఈయన చేసిన పోలీస్ పాత్ర గురించి, వాయిస్ గురించి జనాలు మాట్లాడు కుంటున్నారు.ప్రయోగం చేయకుండా రీ ఎంట్రీలో కూడా డబ్బింగ్ చెప్పిచ్చి ఉంటే బాగుండేది అని అంతా మాట్లాడు కుంటున్నారు.
అయితే టీమ్ ఎందుకు దీనిపై ద్రుష్టి పెట్టలేదో తెలియదు కానీ ఈయన పాత్ర బాగున్న వాయిస్ తేడా కొట్టింది అంటున్నారు ప్రేక్షకులు.







