వైరల్: అంగవైకల్యం అతనికి అడ్డుకాలేదు.. ఒంటి కాలు పైనే బరువైన బస్తాలు మోస్తున్నాడు!

ప్రస్తుత కాలంలో మనిషి మానసికంగా, శారీరకంగా చాలా వీక్ అయిపోతున్నాడు.చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళు మన చుట్టూ ఎంతోమంది వున్నారు.

 Viral Disability Did Not Stop Him He Is Carrying Heavy Bags On One Leg , Viral-TeluguStop.com

అన్ని అవయవాలు సరిగా ఉండి కష్టపడటానికి ఒళ్ళు వంగని వారు మనలోనే వున్నారు.అయితే ఇలాంటి పరిస్థితులలో కూడా కొంతమంది అనేక బలహీనతలు కలిగి ఉండి ఎదుటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అలాంటివారిని చూసినపుడు అన్ని వున్న మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.మనో ధైర్యం, ఆత్మవిశ్వాసమే తోడుగా సాగిపోతున్న ఓ వ్యక్తి కథనమే ఇది.

అతగాడిని చూస్తే మనకు జాలి కలగదు.ఎంతో స్ఫూర్తి పొందుతాం.

అవును.వివరాల్లోకి వెళితే.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి ఒక కాలు లేదు.అయినా చేతి కర్రల సహాయంతో సిమెంట్ బస్తాలను సునాయాసంగా మోస్తున్న తీరు చూస్తే మనకు ఔరా అనిపించకమానదు.

ఇది చూసిన నెటిజన్లు అతనికి జేజేలు కొడుతున్నారు.ఈ వీడియో చాలా మందికి స్ఫూర్తినిస్తుంది.

ముఖ్యంగా చిన్న చిన్న కారణాలు నిస్సహాయతతో ఆత్మహత్య చేసుకునే యువతకు ఈ వ్యక్తి ధైర్యం ఒక మేలుకొలుపు వంటిదని భావించవచ్చు.

ఈ వీడియోను ఓ వ్యక్తి తన ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకు ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు.

ధైర్యం ఉన్నవారికి దేవుడు కూడా అండగా నిలుస్తాడు.ఈ వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

అంతేకాకుండా చాలామంది ఈ వీడియోని చూసి ఎమోషనల్ అవుతున్నారు.అదే సమయంలో ఆ వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని చూసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మన పోరాటాన్ని శక్తిగా మార్చుకోవడం అంటే ఇదేనేమో అని కొంతమంది నెటిజన్లు తెలుసుకుంటున్నారు.జీవితంలో ఏదన్నా సాధించాలి అనుకున్నవారు ఇలాంటి వీడియోలు చూస్తే మరింత ఆత్మవిశ్వాసాన్ని పొందుతారని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube