చాలామంది వినికిడి లోపంతో బాధపడుతూ ఉంటారు.చిన్న చిన్నగా మాట్లాడేవారి మాటలు వినిపించవు.
టీవీలో పెద్దగా సౌండ్ పెట్టుకుని చూడటం, పెద్దగా సౌండ్ పెట్టుకుని పాటలు వినడం లాంటివి చేస్తూ ఉంటారు.వయస్సు పెరిగేకొద్ది వినికిడి లోపం సహజంగా వస్తూ ఉంటుంది.
కొంతమంది చిన్నప్పుడే, మరికొంతమంది వారసత్వంగానూ వినికిడిలోపం వస్తూ ఉంటుంది.అయితే వినికిడి లోపం ఉన్నప్పుడు వెంటనే చికిత్స తీసుకోవాలి.
వినికిడి లోపానికి చికిత్స లు ఉన్నాయి.అయితే తాజాగా వినికిడి లోపంతో బాధపపడేవారి కోసం సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.ఏఆర్ గ్లాస్ ను వినికిడి లోపంతో బాధపడేవారి కోసం అందుబాటులోకి వచ్చాయి.ఈ ఏ ఆర్ గ్లాసెస్ ఆడియోను బస్ టైటిల్స్ గా మారుస్తున్నాయి.
దీని వల్ల వినికిడి లోపంతో బాధపడేవారు సంభాషణలను చూసే అవకాశం ఉంటుంది.
సినిమాల్లో ఆడియోను సబ్ టైటిల్స్ గా మార్చినట్లుగానే.
ఈ గ్లాస్ లు ఆడియోను సబ్ టైటిల్స్ గా మారుస్తున్నాయి.దీని ద్వారా వినికిడి లోపం ఉన్నవారు వాటిని చదవి అర్థం చేసుకుంటారు.
ఇంగ్లాండ్ కు చెందిన స్కార్ఫ్ అనే యువకుడు తన తాత వినికిడి లోపంతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నాడు.దీంతో ఆయన కోసం ఈ ఏఆర్ గ్లాసెస్ రూపొందించాడు.
కేవలం ఆరు నెలల్లో ఈ గ్లాసెస్ కనిపెట్టాడు.ఈ గ్లాసెస్ లోని మైక్రోఫెన్ నుంచి ఆడియో ఫీడ్ ను తీసుకుని దానిని ఫోన్ కు పంపుతుంది.
దీని ద్వారా ఆడియో ఫోన్ లో హెడ్ లైన్స్ గా మారి సాఫ్ట్ వేర్ సాయంతో సబ్ టైటిల్స్ డివైజ్ లో ప్రాజెక్ట్ అవుతాయి.ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థలతో కలిసి దీనిని తయారుచేశాడు.







