బాహుబలి అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రభాస్.అవును… రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.అప్పటివరకు బాహుబలి పేరు మాత్రమే విన్న జనాలు ఆ సినిమా తరువాత బాహుబలి అంటే ఇలా ఉంటాడా? అని తెలుసుకున్నారు.బాహుబలి అంటే భుజ బలానికి నిలువెత్తు నిదర్శనం అని అర్ధం చేసుకున్నారు.
ఇక అప్పటినుండి బయట ప్రపంచంలో అలాంటి బలవంతులని చూసిన జనం వారిని బాహుబలులుగా కీర్తిస్తున్నారు.సోషల్ మీడియా పరిధి పెరుగుతున్నవేళ రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయితే అందులో కొన్ని మాత్రమే చాలా ప్రత్యేకంగా కనబడతాయి.తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఈ కోవకే చెందుతుంది.
వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే… ఓ కూలి ఓ బైక్ ని అమాంతం ఎత్తి తన తలపైన పెట్టుకొని సునాయాసంగా ఓ బస్సుపైకి ఎక్కి, పైన వేసిన దృశ్యం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు అతగాడిని బాహుబలి బంధువు అని కొనియాడుతున్నారు.
ఇకపోతే ఆ బైక్ సుమారు 150 కిలోలు ఉంటుందని అంచనా.అంత బరువైన బైక్ ను అతను ఎత్తిన తీరుని అందరు ప్రశంసిస్తున్నారు.
ఎత్తడం ఒకెత్తయితే దాన్ని బస్సు పైకి ఎక్కించడం మరో ఎత్తు.ఈ వీడియో ట్విట్టర్ ద్వారా పోస్ట్ అయింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని రకరకాల కామెంట్లతో కీర్తిస్తున్నారు.“బాహుబలి బంధువులా వున్నాడు” అని ఒకరు కామెంట్ చేస్తే.“ఒలింపిక్స్ కి పంపిస్తే భారత్ కి 10 స్వర్ణ పతకాలు తేగలడు” అని మరొకరు కామెంట్ చేసారు… ఇప్పటివరకు 90 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.మరెందుకాలస్యం, మీరు కూడా దాన్ని తిలకించి అభిప్రాయాన్ని చెప్పండి.







