మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.
దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.అందుకే మెగాస్టార్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టి ఎలాగైనా ఆచార్యను మరిపించే హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
ప్రెసెంట్ చిరు చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.వాటిలో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.
సెట్ లో రవితేజ ఇటీవలే అడుగు పెట్టాడు.ఈయన అడుగు పెట్టడం తోనే మరింత స్పీడ్ గా ఈ సినిమాను పూర్తి చేస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమాపై మరొక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ సవతి తల్లి సోదరులుగా కనిపిస్తారట.
చిరు సవతి తల్లి తనయుడిగా రవితేజ నటిస్తున్నాడని టాక్.

ఇక రవితేజ భార్యగా క్యాథరిన్ నటిస్తుందని.వీరికి ఒక కూతురు కూడా ఉందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.
మెగాస్టార్ దొంగ పాత్రలో నటిస్తున్నాడట.ఈ దొంగ, పోలీస్ మధ్య సాగే ఆసక్తికర సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని టాక్ వినిపిస్తుంది.
మరి ఈ స్టార్స్ దొంగ పోలీస్ ఆట ఎలా ఉంటుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.







