టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ భార్య ఉపాసనకు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఉపాసన చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా ఆమె ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.
అయితే తాజాగా ఉపాసన కొత్త కారును కొనుగోలు చేశారు.ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన ఆడి కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ కారును ఆమె కొనుగోలు చేశారు.
ఉపాసన కొత్త కారు ఆడి ఇ ట్రాన్ కాగా ఈ కొత్త కారుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు.ఈ కారు విలువ ఏకంగా కోటీ 66 లక్షల రూపాయలు అని బోగట్టా.
ఉపాసన కొత్త కారు గురించి చెబుతూ ఈ ప్రపంచంలో ప్రతిదీ అప్ గ్రేడ్ అవుతుందని అన్నారు.అందులో భాగంగానే నేను కూడా అప్ గ్రేడ్ అయ్యానని ఉపాసన చెప్పుకొచ్చారు.
అలా అప్ గ్రేడ్ కావడంలో భాగంగా ఆడి ఇట్రాన్ కారును కొనుగోలు చేశానని ఉపాసన తెలిపారు.

నా అన్ని అవసరాలకు ఆడి ఇట్రాన్ కారు అనువుగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.ప్రయాణానికి సైతం ఈ కారు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆమె తెలిపారు.ఆడి ఇట్రాన్ కారులో వాయిస్ కమాండింగ్ ఆప్షన్ ఎంతో బాగుందని ఆమె కామెంట్ చేశారు.
ఉపాసన షేర్ చేసిన వీడియోకు 10,000కు పైగా వ్యూస్ 1,000కు పైగా లైక్స్ వచ్చాయి.
చరణ్ భార్య కావడంతో ఉపాసనను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అయితే సినిమా రంగానికి చెందిన విషయాలకు మాత్రం ఉపాసన దూరంగా ఉంటున్నారు.ఉపాసన ఆదాయం కళ్లు చెదిరే స్థాయిలో ఉంటుందని సమాచారం అందుతోంది.
వివాదాలకు, వివాదాస్పద అంశాలకు ఉపాసన దూరంగా ఉంటున్నారు.చరణ్ ఉపాసన అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.







