సినిమా రంగానికి చెందిన వాళ్లలో చాలామంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారనే సంగతి తెలిసిందే.సినిమా రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో సక్సెస్ అవుతారని చెప్పలేం కానీ ఎక్కువమంది సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
అయితే కొంతమంది మాత్రం సినిమా ఇండస్ట్రీ ద్వారా ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన జగపతి బాబు పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
సినిమా ఒక మాయ అయితే పాలిటిక్స్ ఒక మాయాలోకం అని జగపతిబాబు అన్నారు.పాలిటిక్స్ అనే మాయాలోకాన్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదని జగపతిబాబు చెప్పుకొచ్చారు.
నాకు అంత బుర్ర లేదని బుర్ర ఉన్నా ఓపిక లేదని జగపతిబాబు కామెంట్లు చేశారు.
అందువల్ల పాలిటిక్స్ గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదని జగపతిబాబు చెప్పుకొచ్చారు.
నాకు నలుగురితో మాట్లాడే తెలివి లేదని ఆయన అన్నారు.నేను రాజకీయాల్లో జాయిన్ అయ్యి వాళ్లతో ముందుకెళ్లడం సులువు కాదని జగపతిబాబు పేర్కొన్నారు.
నాలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని జగపతిబాబు కామెంట్లు చేశారు.రాజకీయాల గురించి నాకున్న అవగాహన శూన్యం అని జగపతిబాబు అన్నారు.

నేను రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం నేను ఒక పార్టీ పెట్టడం జరగని పని జగపతిబాబు చెప్పుకొచ్చారు.భవిష్యత్తులో కూడా నేను రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం అయితే లేదని జగపతిబాబు పరోక్షంగా కామెంట్లు చేశారు. పరంపర2 సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జగపతిబాబు ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.జగపతిబాబు ప్రస్తుతం తెలుగులో విలన్ రోల్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ తన నటనతో మెప్పిస్తున్నారు.
జగపతిబాబు తన నటనతో ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేస్తున్నారు.







