ఆ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు.. సక్సెస్ అవుతారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారాలపై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు.

 Super Star Mahesh Babu Entry In Restaurent Business Details, Mahesh Babu, Restau-TeluguStop.com

అయితే మహేష్ బాబు అతి త్వరలో రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.ఈ ఏడాది మహేష్ బాబు మేజర్ సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

హైదరాబాద్ లోని పాపులర్ రెస్టారెంట్లలో ఒకటైన మినర్వాతో కలిసి లగ్జరీ రెస్టారెంట్ ను మొదలుపెట్టాలని మహేష్ బాబు ఆలోచన అని తెలుస్తోంది.బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక్కొక్కరు సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని వేర్వేరు రంగాలలో పెట్టుబడులుగా పెడుతున్నారు.

కొంతమంది హీరోలు రియల్ ఎస్టేట్ పై దృష్టి పెడుతుంటే మరి కొందరు హీరోలు మాత్రం పొలాలను కొనుగోలు చేస్తున్నారు.

ప్రస్తుతం లక్షల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో సులువుగా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం అయితే ఉంటుందని హీరోలు భావిస్తుండటం గమనార్హం.

Telugu Amb Cinemas, Mahesh Babu, Pooja Hegde, Trivikram-Movie

కొంతమంది హీరోలు, హీరోయిన్లు కమర్షియల్ కాంప్లెక్స్ లపై దృష్టి పెడుతూ భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు.

మరి మహేష్ బాబు రెస్టారెంట్ బిజినెస్ లో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు ఆగష్టు నుంచి మహేష్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

మహేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube