నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరో గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి చాలా సంవత్సరాలైంది.అయినా ఇప్పటి వరకు సరైన కమర్షియల్ హిట్ ని దక్కించుకోలేక పోయాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తన సినిమాలను తానే భారీ బడ్జెట్తో నిర్మించుకోవడం పరి పాటిగా మారింది.ఆయన ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు నిర్మిస్తూ నటిస్తూ వస్తున్నాడు.
అందులో ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా ఆడిందే లేదు.అయినా కూడా తాజాగా బింబిసార అనే సినిమా ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు ప్రకటించారు.
కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.40 కోట్లతో అనుకున్న సినిమా కాస్త ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు వెళ్లిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇక ఈ సినిమా వచ్చే వారం విడుదల కాబోతున్న నేపథ్యం లో హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ భారీ ఎత్తున అంచనాలు పెరిగేలా వ్యాఖ్యలు చేశాడు.ఈ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ పూర్తిగా మారిపోతుందని ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అన్నయ్య కళ్యాణ్ రామ్ కెరియర్ బింబిసార కి ముందు బింబిసార తర్వాత అన్నట్లుగా ఉంటుందంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.కచ్చితంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల స్థాయిలో ఆ సినిమా ఉండక పోవచ్చు.కానీ ఎన్టీఆర్ మాట్లాడిన దాంట్లో కనీసం సగం కూడా నందమూరి కళ్యాణ్ రామ్ కి చాలా సంవత్సరాల తర్వాత మంచి హిట్టు పడ్డట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలంటే మరో వారం రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.