నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసార సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఆగస్టు 5వ తారీకున భారీ ఎత్తున విడుదల కాబోతున్న బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నారు.
ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడు అంటూ రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటన రావడంతో అప్పటి నుండే అభిమానులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మద్య కాలంలో పెద్ద హీరోల సినిమా లు లేదా పెద్ద హీరోలు గెస్ట్ లుగా వస్తున్న సమయంలో శిల్ప కళా వేదిక లో కార్యక్రమం ను నిర్వహించడం లేదు.
అయినా కూడా బింబిసార యొక్క ఈవెంట్ ను శిల్ప కళా వేదికలో నిర్వహించడం పట్ల నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో మొదటి నుండే శిల్ప కళా వేదికలో కార్యక్రమం ఏంటీ అంటూ కొందరు విమర్శించారు.
అంతా భావించినట్లుగానే భారీ ఎత్తున శిల్ప కళా వేదిక వద్దకు నందమూరి అభిమానులు చేరుకున్నారు.దానికి తోడు వర్షం భారీ గా కురియడం తో సినిమా ఫంక్షన్ కు హాజరు అయ్యేందుకు వచ్చిన అభిమానులు ఎక్కడికి అక్కడ ఇరుక్కు పోయారు.
కనీసం సగం మందికి కూడా శిల్ప కళా వేదిక లోకి ఎంట్రీ లభించలేదు అంటూ టాక్ వినిపిస్తుంది.నందమూరి అభిమానులు ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో అసంతృప్తి తో ఉన్నారు.
శిల్ప కళా వేదిక వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమను లోనికి అనుమతించాలంటూ కాస్త హంగామా చేశారు.కార్యక్రమం మొదలు అవ్వడంతో పాస్ లు లేని అభిమానులు అక్కడ నుండి వెళ్లి పోయారు.
ఎన్టీఆర్ హాజరు అవుతున్న సమయంలో వెన్యూ వేరే చోట ఉండాల్సిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







