బేబీ ఆయిల్ అంటే చిన్న పిల్లలకు మాత్రమే యూస్ అవుతుందని అనుకుంటే పొరపాటే.ఎందుకంటే, మన చర్మ సౌందర్యానికి కూడా బేబీ ఆయిల్ ఎన్నో లాభాలను చేకూరుస్తుంది.
అనేక చర్మ సమస్యలను నివారించేందుకు సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు, డార్క్ స్కిన్, డల్ స్కిన్.
ఇలా వివిధ రకాల స్కిన్ ప్రాబ్లమ్స్‌కు బేబీ ఆయిల్‌తో చెక్ పెట్టవచ్చు.అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలు, మచ్చలు మరియు ముడతలను బేబీ ఆయిల్‌తో దూరం చేసుకోవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బేబీ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, చిటికెడు కుంకుపువ్వు, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలిపి రెండు గంటల పాటు వదిలేయాలి.
ఆపై ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుని.ప్రతి రోజు స్నానం చేయడానికి గంట ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇలా చేస్తే మొటిమలు, ముదురు రంగు మచ్చలు, మరియు ముడతలు పరార్ అవుతాయి.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల బేబీ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల పపాయ జెల్, చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధం అవుతుంది.
ఈ క్రీమ్‌ను ఫిడ్జ్‌లో స్టోర్ చేసుకుని.ప్రతి రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇలా చేస్తే స్కిన్ టోన్ పెరుగుతుంది.మరియు డల్ స్కిన్ బ్రైట్‌గా, షైనీగా మారుతుంది.

ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బేబీ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ పౌడర్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి.పావు గంట అనంతరం వాటర్‌తో క్లీన్ చేసుకుంటే మృత కణాలు, మురికి తొలగిపోయి ముఖం గ్లోయింగ్‌గా మారుతుంది.







