యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌పై విద్వేష వ్యాఖ్యలు.. అమెరికా పౌరుడిపై అభియోగాలు

భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్‌‌ను హత్య చేస్తానంటూ బెదిరించిన 49 ఏళ్ల అమెరికా పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడు ప్రమీల ఇంటి బయట తుపాకీతో నిలబడి ఆమెను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడటమే కాకుండా.

 Us Man Charged With Felony Stalking After Shouting Expletives Outside Indian-ame-TeluguStop.com

‘‘గో బ్యాక్ టు ఇండియా’’ అంటూ నినాదాలు చేశాడు.దీనికి సంబంధించి నిందితుడిపై పలు అభియోగాలు మోపారు.

నిందితుడిని బ్రెట్ ఫోర్సెల్‌గా గుర్తించారు.ఈ కేసుకు సంబందించి కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం 5,00,000 డాలర్ల పూచీకత్తుపై బెయిల్ అభ్యర్ధించింది.

అయితే ఇంత జరిగినా నిందితుడు తన ప్రవర్తన మార్చుకోలేదు.తాను జైలు నుంచి విడుదలైన వెంటనే ప్రమీల ఇంటికి తిరిగి వస్తానని విచారణాధికారులకు తెలిపినట్లుగా తెలుస్తోంది.ఘటన జరిగిన రోజున ఫోర్సెల్.40 క్యాలిబర్ గ్లాక్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌తో ప్రమీలా జయపాల్ ఇంటి వద్ద కాచుకుని కూర్చొన్నాడని అధికారులు తెలిపారు.

జూలై 9న ప్రమీలా జయపాల్, ఆమె భర్తకు వెస్ట్ సీటెల్‌లోని తమ ఇంటి బయటి నుంచి పెద్దగా అరుపులు, కేకలు వినిపించాయి.జయపాల్ భర్త.స్టీవ్ విలియమ్సన్ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు బయటకు వెళ్లాడు.అక్కడ కొందరు ‘‘గో బ్యాక్ టు ఇండియా’’ అంటూ బెదిరించారు.

అయితే విలియమ్సన్ తలుపు తెరిచి చూడగా… ఇంటి బయట వున్న ఓ వ్యక్తి వాహనంలోకి ఎక్కి వేగంగా వెళ్లిపోయాడు.ఈ ఘటనకు సంబంధించి ప్రమీలా జయపాల్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

నిందితుడు ఫోర్సెల్ అరెస్ట్‌కు సంబంధించి.కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం, సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్, యూఎస్ క్యాపిటల్ పోలీస్, హౌస్ సార్జెంట్ ఎట్ ఆర్మ్స్‌కు ప్రమీలా జయపాల్ ధన్యవాదాలు తెలిపారు.

తనను, తన కుటుంబాన్ని , తన సిబ్బందిని సురక్షితంగా వుంచడంలో సాయం చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.

Telugu India, Pramila Jayapal, Felonyindian-Telugu NRI

అయితే జూలై 2న అచ్చం ఇలాంటి సంఘటనే తన ఇంటి వద్ద జరిగిందని ప్రమీలా జయపాల్ తెలిపారు.ఆ రోజు ఒక కారు అనుమానాస్పదంగా తన ఇంటి పరిసరాల్లో సంచరించిందని చెప్పారు.దీనిని గమనించిన విలియమ్సన్.

భద్రత కోసం పోలీసులను పిలవాల్సిందిగా జయపాల్‌ను కోరాడు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు.

ఇకపోతే.56 ఏళ్ల ప్రమీలా జయపాల్ 2016లో యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు.ఆమె వరుసగా మూడోసారి ప్రతినిధుల సభకు ఎన్నికై సత్తా చాటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube