చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా మారిపోయాడు కృష్ణ. అయితే ఇక ఇండస్ట్రీలో ట్రెండ్ సృష్టించిన హీరోగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ దగ్గర నుంచి కలర్ సినిమాల వరకూ సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది కూడా కృష్ణ అని సినీ విశ్లేషకులు ఇప్పటికీ గొప్పగా చెబుతూ ఉంటారు.అయితే కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా డైరెక్టర్గా కూడా కృష్ణ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు.
ఇక మొట్టమొదటి కౌబాయ్ చిత్రం.మొట్టమొదటి కలర్ సినిమా.మొట్టమొదటి 70 ఎంఎం సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి అనేది కృష్ణకు ప్రతి విషయంలో వర్తిస్తుంది అని చెప్పాలి.అయితే సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలోనే తనతో పాటు ఎన్నో సినిమాల్లో నటించిన హీరోయిన్ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు.
పెళ్లికి ముందు వీరిద్దరూ ఎన్నో ఏళ్ల పాటు ప్రేమ లో ఉన్నారు.అయితే కృష్ణ కు ఇది రెండో వివాహం కావడం గమనార్హం.1969 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది.అయితే వీరి వివాహం జరిగే సమయానికి అప్పటికే కృష్ణ కి పెళ్లి అయిపోయి రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల పిల్లలు కూడా ఉన్నారు.
అదే సమయంలో ఇక విజయనిర్మలకు కూడా అప్పటికే పెళ్లయి నరేష్ సంతానం గా ఉన్నాడు.

అయితే కృష్ణ విజయనిర్మల పెళ్లి చేసుకోవడాన్ని కృష్ణ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది.ముఖ్యంగా కృష్ణ గారి అమ్మగారు.నేను మీ పెళ్లికి ఒప్పుకోను అంటూ ముఖం మీద చెప్పేశారట.
ఇందిరా కు ఇంత అన్యాయం చేస్తావా అంటూ చెడామడా తిట్టేశారట.ఇలాంటి సమయంలోనే కృష్ణ కుటుంబాన్ని ఎలా ఒప్పించాలి తెలియక సతమతమవుతున్న సమయంలో.
ఆయన సోదరుడు ఆదిశేషు చొరవ తీసుకుని కృష్ణ తల్లిని మరియు కృష్ణ మొదటి భార్య ఇందిరానీ ఒప్పించే పనిలో పడ్డారట.చివరికి వీరి అంగీకారంతోనే కృష్ణ విజయ నిర్మల మెడలో మూడుముళ్లు వేశారు.
ఇక అప్పటి నుంచి కృష్ణ అన్ని బాగోగులు కూడా విజయనిర్మల దగ్గరుండి చూసుకుంటు వచ్చింది.అందుకే విజయనిర్మల చనిపోయిన సమయంలో కృష్ణ ఎంతలా బాధ పడి నైరాశ్యంలో మునిగిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.







