బాహుబలి తరహాలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఆగష్టు 11న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
తాను మహానాయకుడు షూటింగ్ లో ఉన్న టైం లో వశిష్ట కలిసి ఓ కథ చెప్పాలని అన్నాడు.తనకి ఎప్పటినుంచో ఒక రాజుల నాటి కథ తీయాలని కోరిక ఉండేది.
అలా అనుకునే టైం లోనే వశిష్ట ఈ కథ చెప్పడం కథ నచ్చి ఓకే చేయడం జరిగింది.అయితే రాజుగా నటించడం అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే.
అది కూడా ప్రభాస్ ని బాహుబలిలో చూశాక ఇంకాస్త భయం వేసింది.రాజంటే అలానే ఉండాలని ప్రభాస్ ని చూస్తే అనిపించింది.
ఆ తర్వాత మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని ప్రయత్నించానని అన్నారు కళ్యాణ్ రామ్.నందమూరి హీరో ప్రభాస్ బాహుబలి గురించి ఇలా ఓపెన్ అవడం రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఖుషి అవుతున్నారు.
ఈమధ్య హీరోలు ఒకరిని ఒకరు పొగడటం కామన్ అయ్యింది.అదే ఇండస్ట్రీకి కూడా మంచిదని భావిస్తున్నారు.ఇక బింబిసార సినిమా విషయానికి వస్తే రాజుల కథతో కళ్యాణ్ రామ్ రెండు విభిన్న పాత్రలతో అలరించనున్నారు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, కేథరిన్ త్రెసా నటించారు.

నూతన దర్శకుడే అయినా వశిష్ట చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారని అంటున్నారు కళ్యాణ్ రామ్.సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు.అయితే లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ చూస్తే కళ్యాణ్ రామ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ లోనే కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం సరికొత్తగా కనిపిస్తుంది.
కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఏమేరకు నచ్చుతుందో చూడాలి.







