పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు అది మానేసి తప్పుడు పనులు చేయిస్తున్నారు.కొందరు టీచర్లు మొత్తం టీచర్ల వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు.
తల పొగరుతో విద్యార్థులను తమకు బానిసల్లాగా వాడుకుంటున్నారు.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో పోఖారీ ప్రైమరీ స్కూల్ టీచర్ చాలా ఘోరంగా ప్రవర్తించింది.
ఈ ప్రభుత్వ మహిళా టీచర్ పేరు ఊర్మిళా సింగ్. ఈమె చాలా పొగరుగా ప్రవర్తిస్తుంది.
విద్యార్థులను బాగా కొడుతుందట.అలానే వారితో అడ్డమైన పనులు చేయిస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఓ విద్యార్థితో ఈ మహిళా టీచర్ మసాజ్ చేయించుకుంది.ఈ దృశ్యాలను ఎవరో తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
అది కాస్తా విపరీతంగా వైరల్ అవుతోంది.అలా ప్రాథమిక శిక్షా అధికారి దృష్టికి కూడా ఈ వీడియో చేరింది.
దీంతో ఇలా చేయడం చాలా తప్పు అని ఆ అధికారి ఆగ్రహించారు.అనంతరం ఈ ఘటనలో ఆమె తప్పు ఉందని నిర్ధారించుకొని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో, పోఖారీ ప్రైమరీ స్కూల్ టీచర్ కుర్చీలో హాయిగా కూర్చొని ఉండటం గమనించవచ్చు.ఒక క్లాస్ రూమ్‌లో ఆమె అలా కూర్చొని ఉండగా విద్యార్థులు అటూ ఇటూ తిరుగుతున్నారు.ఒక విద్యార్థి మాత్రం ఆ టీచర్ చేతిని మసాజ్ చేస్తూ కనిపించాడు.ఈ టీచర్ బవాన్ బ్లాక్ ప్రాథమిక విద్యా విభాగం పరిధిలోని ఓ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ అట.ఈమె విద్యార్థులకు చదువు చెప్పడం అటుంచితే వారి తోటి ఇలాంటి పనులు చేయిస్తుందని ఆరోపణలు ఉన్నాయి.ఇప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో ఆమెను సస్పెండ్ చేశారు.







